మెగా భారీ బ్యానర్లు మూడు చేతులు కలిపాయి. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, క్రేజీ బ్యానర్ యూవీ క్రియేషన్లు, తమిళనాట పాపులర్ బ్యానర్ స్టూడియో గ్రీన్ కలిసాయి. ఈ మూడు కలి జియుఎస్ పేరిట కొత్త బ్యానర్ పెట్టాయి.
అల్లు అరవింద్ మాస్టర్ బ్రెయిన్ ఇది. థియేటర్ల నిర్వహణ కోసం యూవీ, దిల్ రాజులతో కలిపి ఓ సంస్థ స్టార్ట్ చేసారు. అలాగే తనను నమ్ముకున్న వారిని ఎంకరేజ్ చేసి నిర్మాతలుగా మార్చేందుకు జిఎ 2 సంస్థ స్టార్ట్ చేసారు. ఇప్పుడు మీడియం, భారీ సినిమాలు తెలుగు, తమిళంలో తీసేందుకు ఈ కొత్త బ్యానర్ స్టార్ట్ చేసారు. తమిళనాట స్టూడియో గ్రీన్, తెలుగులో యూవీ వ్యవహారాలు చూసుకుంటాయి. అరవింద్ తన అనుభవాన్ని, తన సర్కిల్ ను, తన పెట్టుబడిని అందిస్తే చాలు.
ప్రస్తుతం గీతా, యూవీ, స్టూడియో గ్రీన్ ఎవరి ప్రాజెక్టుల్లో అవి బిజీగా వున్నాయి. ఈ బ్యానర్ పై ప్రారంభంలో మీడియం రేంజ్ సినిమాలు తీసే ఆలోచనలో వున్నారు.