పవన్ పై పోరుకు ప్లాన్?

ఒక్కోసారి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. చిన్న సమస్య నైనా పెద్ద ఆలోచన చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ శరద్ మరార్ కానీ చేయాల్సింది ఇదే. Advertisement సర్దార్ గబ్బర్ సింగ్…

ఒక్కోసారి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. చిన్న సమస్య నైనా పెద్ద ఆలోచన చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ శరద్ మరార్ కానీ చేయాల్సింది ఇదే.

సర్దార్ గబ్బర్ సింగ్ వ్వవహారమే ఇది. నిజానికి ఇక్కడ అవుట్ రేట్ కు కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయి. అందువల్ల చట్టబద్ధంగా ఏమీ సమస్యలేదు. కానీ నైతికత పాయింట్ కు వస్తే తేడా వస్తుంది. తన మిత్రుడు శరద్ మరార్ నష్టపోయాడని అతనికి మరో సినిమా చేస్తున్నా అని పవన్ ఓపెన్ గానే చెప్పారు. మిత్రుడు నష్టపోతే చేస్తున్నారు, మరి బయ్యర్లం మేం నష్టపోతే సాయం చేయరా అన్నది వీళ్ల పాయింట్. ఇక్కడ ఇంకో సమస్య ఏమిటి అంటే పవన్ కేవలం హీరో కాదు. రాజకీయపార్టీ నేత. ప్రజల్లోకి వెళ్తున్న వ్యక్తి.

అందువల్ల ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఫోకస్ ఎక్కువ వుంటుంది. అందుకే దీన్ని బేస్ చేసుకుని పవన్ పై పోరు సాగించాలని ప్లాన్ చేస్తున్నట్లుంది సర్దార్ బయ్యర్లు. నేరుగా కాకుండా పరోక్షంగా పవన్ పై ప్రెజర్ పెట్టాలని వారు ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ఫిలింనగర్ సర్కిల్ లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా అని ఓ బయ్యర్ చెబుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. పైగా కోట్ల డబ్బులు పోయిన వారు ఫ్రస్టేట్ అయితే మరీ కష్టం.

అయితే ఇక్కడ బయ్యర్లది కూడా తప్పువుంది. వ్యాపారం చేసి, నష్టపోయి తమను ఆదుకోమని అడగడం ఏమిటి? ఎన్ని సినిమాలు పోతున్నాయి. ఎన్ని కోట్లు పోతున్నాయి? సినిమా అంటేనే జూదంలా తయారయింది. పోటీకి పోయి కోట్లకు కోట్ల పెట్టి కొనేస్తున్నారు. ఆ తరువాత రాకపోతే లబోదిబో అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా?

ఇక్కడ పవన్ కు ఒకటే ఆబ్లిగేషన్. లాస్ అయిన  మిత్రుడిని ఆదుకోవడానికి సినిమా చేస్తున్నాడు కాబట్టి, బయ్యర్లను కూడా ఏదో ఒకటి చేసి ఆదుకోవడం. ఈ సమస్యను సద్దుమణిగేలా చేయడం. లేదూ అంటే అనవసరపు రచ్చ. ఆయన రాజకీయ మార్గంలో చిన్న హర్డిల్ గా మారే అవకాశం. పవన్ కాస్త ఆలోచిస్తే బెటర్.