బాలయ్య తెలుసుంటే..మంత్రి కేంటీ?

చిన్న చాన్స్ దొరికితే చాలు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ నుంచి చంద్రబాబు దాకా ప్రతి ఒక్కరు జగన్ ను జైల్లోకి నెట్టేసినంతగా మాటల తూటాలు విసురుతారు. నిన్నటికి నిన్న తెలుగుదేశం సభలో చంద్రబాబు చెప్పినదేమిటి?…

చిన్న చాన్స్ దొరికితే చాలు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ నుంచి చంద్రబాబు దాకా ప్రతి ఒక్కరు జగన్ ను జైల్లోకి నెట్టేసినంతగా మాటల తూటాలు విసురుతారు. నిన్నటికి నిన్న తెలుగుదేశం సభలో చంద్రబాబు చెప్పినదేమిటి? తప్పులు చేసిన వారు ఎవరికైనా పనిష్ మెంట్ తప్పదు..ఇంతకు ముందు వైఎస్ చేసారు కదా?ఇప్పుడు మన టైమ్ అని మనం తప్పులు చేయద్దు అని. అంటే అర్థం ఏమిటి? మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం జనాలు రెచ్చిపోయి సంపాదన యావలో పడ్డారన్న విషయం బాబుగారి వరకు వచ్చిందని.

ప్రతి జిల్లాలోనూ మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు యథాశక్తి సంపాదనలో పడ్డారు. ఈ విషయంలో నిర్భీతిగా వ్యవహరిస్తున్నారని వార్తలు అందుతున్నాయి. 

ఇందుకో చిన్న ఉదాహరణ

విశాఖకు చెందిన ఓ సినిమా డిస్ట్రిబ్యూటర్ కమ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మన్, ఓ భారీ వెంచర్ వేసారట. అందులో భాగంగా ఏదో పనిపై ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్తే పని ఎంతకూ జరగలేదట. విచారిస్తే, ఓ మంత్రి గారికి ఇవ్వాల్సింది ఇవ్వాలన్న సమాచారం అందిందంట. తనకున్న పరిచయంతో ఆ మంత్రికి సంబంధించిన కీలక వ్యక్తితో మాట్లాడితే నాలుగు కోట్లు డిమాండ్ చేసారట. దీనిపై వాదనలు జరిగాయట. దాంతో ఫైల్ ఎమ్మార్వో దగ్గర నుంచి ఆర్డీవో దగ్గరకు వెళ్లి, పెండింగ్ లో పడిందట. సదరు డిస్ట్రిబ్యూటర్ కు బాలయ్య దగ్గర కాస్త మంచి పలుకుబడే వుంది. అయినా కూడా ఎంతో కష్టపడి, ఎర్త్ అండ్ హెవెన్ మూవ్ చేస్తే తప్ప పని కాలేదట. ఎంత అడ్డం పడాలో అంతా అడ్డం పడ్డారట సదరు మంత్రి. 

తెలుగుదేశం పార్టీ కే సంబంధించిన వారికి, ఆ పార్టీకి కొమ్ముకాసే కీలక సామాజిక వర్గానికి చెందినవారికి, అందునా బాలయ్య దగ్గర పలుకుబడి వున్నవారికే మంత్రులు ఇలా చెమటలు పట్టిస్తుంటే, బాబుగారేంటీ జగన్ కు సుద్దులు చెబుతూ, నానా హడావుడి చేస్తారు?