డల్ నోట్ తో స్టార్ట్ అయిన ఘాజీ

ఘాజీ సినిమాను తెలుగు ఆడియన్స్ ను టార్గెట్ చేసి తీయలేదు. మంచి సినిమా తీద్దాం, నచ్చి లాభాలు వచ్చినా ఓకె. రాకుంటే పేరన్నా వస్తుంది అన్నది నిర్మాతల ఆలోచన. తెలుగు ప్రేక్షకులు అందునా బి…

ఘాజీ సినిమాను తెలుగు ఆడియన్స్ ను టార్గెట్ చేసి తీయలేదు. మంచి సినిమా తీద్దాం, నచ్చి లాభాలు వచ్చినా ఓకె. రాకుంటే పేరన్నా వస్తుంది అన్నది నిర్మాతల ఆలోచన. తెలుగు ప్రేక్షకులు అందునా బి సి సెంటర్ల ఆడియన్స్ కు పాటలు, ఫైట్లు, డ్యాన్స్ లు, అయిటమ్ సాంగ్ లు లేని సినిమా నచ్చుతుందా అని భయపడుతూనే వున్నారు. 

అనవసరంగా థియేటర్ల రెంట్ లు కట్టుకోవాలని, చాలా లిమిటెడ్ థియేటర్లలో విఢుదల చేసారు. దానికి తోడు మల్టీ ఫ్లెక్స్ లు కూడా జస్ట్ రెండు లేదా మూడు షోలు మాత్రమే ఇచ్చాయి. దీంతో తొలిరోజు ఓపెనింగ్ కలెక్షన్లు ఆ రేంజ్ కు తగినట్లే వచ్చాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిపి జస్ట్ కోటీ ఇరవై లక్షల మేరకు షేర్ వచ్చింది.

ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఓవర్ సీస్ లో నిర్మాతలే నేరుగా విడుదల చేసుకున్నారు. హిందీ వెర్షన్ ను మాత్రం 15 పర్సంట్ కమిషన్ పై కరణ్ జోహార్ ద్వారా విడుదల చేయించారు. హిందీ వెర్షన్ కలెక్షన్ల వివరాలు ఇంకా తెలియలేదు.

అయితే పాజిటివ్ థింగ్ ఏమిటంటే, విడుదలైన సాయంత్రం నుంచి కలెక్షన్లు బాగుండడం, ఈ శని, ఆది వారాల్లో అన్ని అర్బన్ సెంటర్లు, మల్టీ ఫ్లెక్స్ లు ఫుల్ అయిపోయాయి. మల్టీ ఫ్లెక్స్ లు షోలు పెంచాయి. అందువల్ల శని, ఆదివారాల కలెక్షన్లు బాగా వుండే అవకాశం వుంది. ఫుల్ పాజిటివ్ బజ్ వుంది కాబట్టి మండే నుంచి కూడా అలాగే వుంటే ఘాజీ గట్టెక్కేసినట్లే.