రన్స్‌ మెషీన్‌.. ఎదురే లేదిక.!

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఇకపై రన్స్‌ మెషీన్‌ అనాల్సిందే. ఈ రన్స్‌ మెషీన్‌కి ఎదురే లేదిక. వరుసగా నాలుగు టెస్ట్‌ సిరీస్‌లు.. ప్రతి సిరీస్‌లోనూ డబుల్‌ సెంచరీ.. వెరసి, విరాట్‌ కోహ్లీ అరుదైన…

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఇకపై రన్స్‌ మెషీన్‌ అనాల్సిందే. ఈ రన్స్‌ మెషీన్‌కి ఎదురే లేదిక. వరుసగా నాలుగు టెస్ట్‌ సిరీస్‌లు.. ప్రతి సిరీస్‌లోనూ డబుల్‌ సెంచరీ.. వెరసి, విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డుని సృష్టించాడు. ఇప్పటిదాకా బ్రాడ్‌మన్‌, ద్రావిడ్‌ మాత్రమే వరుసగా టెస్ట్‌ సిరీస్‌లలో మూడు డబుల్‌ సెంచరీలు సాధించారు. ఇప్పుడు ఆ రికార్డుల్ని బద్దలుగొట్టిన విరాట్‌ కోహ్లీ, నాలుగు డబుల్ సెంచరీల సరికొత్త రికార్డుతో సత్తా చాటాడు. 

ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ పరుగుల వరద ఎలా వుందంటే, ప్రతి పరుగూ ఓ రికార్డు.. ప్రతి అర్థ సెంచరీ ఓ రికార్డు.. ప్రతి సెంచరీ, డబుల్‌ సెంరీ ఓ రికార్డు.. అనేలా వుందనడం అతిశయోక్తి కాదేమో. ఓ వైపు కెప్టెన్‌గా సిరీస్‌ విజయాలు, ఇంకో వైపు, వ్యక్తిగత ఖాతాలో పరుగుల పరంగా రికార్డులు.. ఇవన్నీ చూస్తే, కెరీర్‌లో విరాట్‌ కోహ్లీ అత్యద్భుతమైన ఫేజ్‌ని కొనసాగిస్తున్నాడని చెప్పక తప్పదు. 

గత ఏడాది మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన కోహ్లీ, ఈ ఏడాదీ డబుల్‌ సెంచరీతో స్టార్ట్‌ చేయడం చూస్తే, ఈ ఏడాది కూడా మూడు డబుల్‌ సెంచరీలు అంతకు మించి కొట్టేలానే వున్నాడు. అవునుమరి, విరాట్‌ కోహ్లీ ఫామ్‌ ఆ రేంజ్‌లో వుంది. బంగ్లాదేశ్‌తో హైద్రాబాద్‌ వేదికగా జరుగుతున్న ఒకే ఒక్క టెస్ట్‌ మ్యాచ్‌లో రెండో రోజూ భారత బ్యాట్స్‌మెన్‌ సత్తా చాటుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి భారత స్కోర్‌ బోర్డ్‌ 650 పరుగులు దాటేసింది.