చైతన్య..నిఖిల్ ఒకే లైన్ తో..?

సుధీర్ వర్మ డైరక్షన్ లో నిఖిల్ హీరోగా కేశవ సినిమా ప్రారంభమైపోయింది. దాదాపు షూట్ కూడా పూర్తి కావస్తోంది. లేటెస్ట్ గా నాగచైతన్య కొత్త డైరక్టర్ తో కలిసి సాయి కొర్రపాటి నిర్మాతగా చేయబోయే…

సుధీర్ వర్మ డైరక్షన్ లో నిఖిల్ హీరోగా కేశవ సినిమా ప్రారంభమైపోయింది. దాదాపు షూట్ కూడా పూర్తి కావస్తోంది. లేటెస్ట్ గా నాగచైతన్య కొత్త డైరక్టర్ తో కలిసి సాయి కొర్రపాటి నిర్మాతగా చేయబోయే సినిమా స్టార్ట్ అయింది. ఈ సినిమాలు రెండింటికీ లైన్ మ్యాచ్ అవుతోందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. 

రెండూ రివెంజ్ స్టోరీలే. తండ్రి మరణానికి కారణమైన వారిని కనిపెట్టి, పగతీర్చుకునే కథలే. నిఖిల్ సినిమాకు కొద్దిగా రోడ్ మూవీ టచ్ వుంటుంది. నాగ్ చైతన్య సినిమాకు కాస్త థ్రిల్లర్ టచ్ ఎక్కువ వుంటుందట. ఒక విధంగా క్షణం సినిమాను కాస్త లార్జ్ స్కేల్ లో చూసినట్లు వుంటుందట నాగ్ చైతన్య సినిమా. ఈ సినిమాకు సాయి కొర్రపాటి లాంటి భారీ ప్రొడ్యూసర్ వున్నా, సినిమా మాత్రం చిన్న బడ్జెట్ సినిమానే నంట. 

ఇదిలా వుంటే హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ తో తయారైన చిన్న సినిమా వెంకటాపురం కూడా క్షణం మాదిరిగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నే నంట.