వివి వినాయక్ మళ్లీ ఓ విధంగా ఫామ్ లోకి వచ్చినట్లే. అఖిల్ తో పడిన మచ్చ తుడిచేసుకున్నట్లే. ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఆయనకు మళ్లీ కాస్త టైమ్ వచ్చింది. ఇప్పుడు రెండు సినిమాలను వినాయక్ ప్లాన్ చేసుకున్నారు. ఒకటి సాయి ధరమ్ తేజతో. రెండవది ఎన్టీఆర్ తో. రెండింటికి నిర్మాత నల్లమలపు బుజ్జినే.
అయితే ఏది ముందుగా స్టార్ట్ అవుతుందన్నదే ఇంకా తెలియదు. ఎన్టీఆర్ తో చేద్దాం అనుకుంటే త్రివిక్రమ్ సినిమా అడ్డు వస్తోంది. సాయి ధరమ్ తో చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఆల్ రెడీ అదే హీరోతో, అదే నిర్మాత సినిమా చేస్తున్నారు. తేజ కూడా జవాన్ సినిమా స్టార్ట్ చేసేసాడు. అందువల్ల ప్రస్తుతానికి వినాయక్ కొంతకాలం టైమ్ పాస్ చేయాల్సి వచ్చేలా వుంది.
త్రివిక్రమ్ కనుక పవన్ తో చేయాల్సిన సినిమా అంత త్వరగా ఫినిష్ కాక, ఎన్టీఆర్ సినిమా లేట్ చేస్తే మాత్రం వినాయక్ రెడీ అయిపోతారు. పవన్ వ్యవహారం తెలుసు కనుక అదే జరుగుతుందేమో అని అనుమానం. ఎందుకంటే నవంబర్ నుంచి డేట్ లు ఇస్తానని హారిక హాసిని బ్యానర్ ను పవన్ ఊరిస్తూ వస్తున్నాడు. మే నాటికన్నా ఇస్తాడా అన్నదే అనుమానం.