అయిటమ్ అమ్మాయిలు కావలెను

అయిటమ్ అమ్మాయిలు అంటే వ్యాంప్ క్యారెక్టర్లు వేసే అమ్మాయిల వంక చూసే రోజులు ఎప్పుడో పోయాయి. మీడియం సినిమాలు అయితే హాట్ ఏంకర్లు, బేరాలు లేని హీరోయిన్లు ఛాయిస్. అదే కాస్త భారీ సినిమాలు…

అయిటమ్ అమ్మాయిలు అంటే వ్యాంప్ క్యారెక్టర్లు వేసే అమ్మాయిల వంక చూసే రోజులు ఎప్పుడో పోయాయి. మీడియం సినిమాలు అయితే హాట్ ఏంకర్లు, బేరాలు లేని హీరోయిన్లు ఛాయిస్. అదే కాస్త భారీ సినిమాలు అయితే పేరున్న హీరోయిన్లకు భారీ పారితోషికంతో గేలం వేయడం కామన్ అయిపోయింది. రాబోయే కొన్ని సినిమాలకు అయిటమ్ అమ్మాయిల సెలక్షన్ కోసం ఆప్షన్స్ రెడీగా వున్నాయి

వీటిల్లో రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ సినిమా ఒకటి. సుకుమార్ సినిమాలు అంటే అయిటమ్ సాంగ్ స్పెషల్ నే. చరణ్ తో చేసే సినిమాలో కూడా మాంచి అయిటమ్ సాంగ్ వుందట. అయితే ఇంకా చాలా దూరం వుంది కాబట్టి ఇంకా ఎవరినీ డిసైడ్ చేయలేదు. కానీ ఎవరైనా క్రేజీ హీరోయిన్ నే అయిటమ్ సాంగ్ కు ఫిక్స్ అని డిసైడ్ అయిపోయారట.

ఇక రానాతో తేజ చేస్తున్న సినిమాలో కూడా మాంచి అయిటమ్ సాంగ్ వుందట. దానికి కూడా ఎవరైనా హీరోయిన్ చేతే చేయించాలని డిసైడ్ అయిపోయారు. ఎవరన్నదే డిసైడ్ కావాలి. ఇక బన్నీ-హరీష్ శంకర్ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ వుండనే వుంది. దీనికి ఇప్పటికే బన్నీ-హరీష్ కలిసి ఓ ఫిగర్ నేమ్ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇంకా బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు.