తెలుగులో పవన్‌కళ్యాణ్ హీరోగా వచ్చిన 'బంగారం' సినిమాలో నటించిన మీరా చోప్రా గుర్తుందా.? అదేనండీ, నితిన్‌తోనూ ఓ సినిమాలో నటించి, ఆ సినిమా దర్శక నిర్మాతల్ని ముప్పు తిప్పలు పెట్టిన మీరా చోప్రా, ఆ తర్వాత 'జగన్మోహిని' అనే మరో సినిమాలో కూడా నటించింది. తెలుగులోనూ, తమిళంలోనూ అమ్మడికి 'ఐరన్ లెగ్' అనే ఇమేజ్ వచ్చింది. చేసిన సినిమాలకన్నా, వివాదాలే ఎక్కువ ఆమెకి.
ప్రస్తుతం బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న మీరా చోప్రా, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రాకి బంధువు కూడా. ఆ బంధుత్వంతోనే, ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌కి తీసుకెళుతోందట మీరా చోప్రాని. 'క్వాంటికో' అనే టీవీ షోలో ప్రియాంక నటిస్తుండగా, అలాంటిదే మరో ఆఫర్ తన వద్దకు వచ్చేసరికి, ఆ ఆఫర్‌ని మీరా చోప్రాకి ఇవ్వాలనుకుంటోందట. అక్క (వరసకి అక్కే అవుతుంది ప్రియాంక, మీరా చోప్రాకి) ఇప్పటికే తనకు 'హాలీవుడ్' సమాచారమిచ్చిందంటూ మీరా చోప్రా ఎగిరి గంతేస్తోంది.
బాలీవుడ్‌లో ఇప్పటికే ఒకటీ అరా సినిమాల్లో చేసినా మీరా చోప్రాకి.. అక్కడా పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. గ్లామర్ విషయంలో మొహమాటాలేమీ లేవుగానీ, దర్శక నిర్మాతల్ని తన అహంకారంతో వేధింపులకు గురిచేయడమే మీరా చోప్రా బ్యాడ్ హ్యాబిట్ అనీ, అదే ఆమెను హీరోయిన్‌గా ఎదగనీయకుండా చేస్తోందన్న విమర్శలున్నాయి. మరి అక్క దయతో హాలీవుడ్‌లోకి అడుగు పెడ్తున్న మీరా, అక్కడన్నా పద్ధతిగా నడుచుకుంటుందా.? వేచి చూడాల్సిందే.