మణిశర్మ..రెండు కోట్లకు సరిపోరా?

మణిశర్మ.. సీనియర్ సంగీత దర్శకుడు. అద్భుతమైన కెరీర్ ను చూసిన వారు. కానీ తరువాత డౌన్ అయ్యారు. కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. చేతికి బోలెడు సినిమాలు అందాయి.…

మణిశర్మ.. సీనియర్ సంగీత దర్శకుడు. అద్భుతమైన కెరీర్ ను చూసిన వారు. కానీ తరువాత డౌన్ అయ్యారు. కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. చేతికి బోలెడు సినిమాలు అందాయి. ఇప్పుడు అదే పూరి-అదే రామ్ కాంబినేషన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా స్టార్ట్ అయింది. కానీ మణి పేరు మాత్రం ఫిక్స్ కాలేదు. అసలు మ్యూజిక్ డైరక్టర్ డిస్కషన్ సాగుతోంది. దీని వెనుక ఏం జరిగింది? జరుగుతోంది? అంటే కాస్త ఆసక్తికరమైన కబుర్లు వినిపిస్తున్నాయి.

పూరి సినిమాలకు సంగీత దర్శకులకు పెద్దగా పని వుండదు. ఎందుకంటే ట్యూన్ లు, రిఫరెన్స్ లు అన్నీ ఆయనే ఇస్తారు. అందుకే మణిశర్మను మరోసారి పిలిచి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ రెమ్యూనిరేషన్ గా రెండు కోట్లు అడిగినట్లు తెలుస్తోంది. అమ్మో.. అంత ఇవ్వలేమని చార్మి-పూరి అనడంతో వ్యవహారానికి బ్రేక్ పడినట్లు బోగట్టా. 

తనకు ఆ మాత్రం వర్త్ లేదా… పైగా తాను అమౌంట్ అంతా పట్టుకెళ్లిపోను కదా, సినిమా క్వాలిటీకే ఖర్చు చేస్తాను కదా అని మణిశర్మ తన సన్నిహితుల దగ్గర ఫీల్ అయినట్లు తెలుస్తోంది. మణిశర్మకు కమ్ బ్యాక్ ఫిల్మ్ ఇచ్చింది తామే కదా.. తమ దగ్గరే ఎక్కువ అడిగితే ఎలా నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఆ తరువాత థ‌మన్ ను తీసుకోవాలనుకున్నారు. కానీ థమన్ పారితోషికం అయిదారు కోట్లు అనే సరికి మళ్లీ అక్కడా బ్రేక్ పడింది.

భీమ్స్ ను తీసుకోవాలనుకున్నారు.. కానీ ఆయన రెమ్యూనిరేషన్ కూడా దగ్గర దగ్గర రెండు కోట్లు. దాంతో మళ్లీ ఆలోచనలో పడ్డారు.

వెనక్కు వెళ్లి మణిశర్మ ను తీసుకోవాలనుకుంటే ఇగో అనేది ఒకటి వుంటుంది కదా..అందుకే రకరకాల పేర్లు పరిశీలిస్తున్నారు. కానీ ఎవర్ని పడితే వాళ్లను తీసుకుంటే పాటలు వచ్చేయవచ్చు కానీ సరైన పేరు లేకపోతే అడియో రైట్స్ రావు కదా? అది కూడా సమస్యే.

మొత్తం మీద డబుల్ ఇస్మార్ట్ కు ఎవరు సంగీతం అందిస్తారో కాస్త ఆసక్తిగానే వుంది.