కాటమరాయుడు ముందుకు వస్తాడా?

కాటమ రాయుడు సినిమాను మార్చి లాస్ట్ వీక్ లో విడుదల చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచనలు సాగుతున్నాయి. మార్చి 24న విడుదల చేస్తే బాగుంటుందా? పరీక్షల తేదీలేమిటి? ఇలాంటి డిస్కషన్లు నడుస్తున్నాయి. ఫిబ్రవరి అంతా…

కాటమ రాయుడు సినిమాను మార్చి లాస్ట్ వీక్ లో విడుదల చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచనలు సాగుతున్నాయి. మార్చి 24న విడుదల చేస్తే బాగుంటుందా? పరీక్షల తేదీలేమిటి? ఇలాంటి డిస్కషన్లు నడుస్తున్నాయి. ఫిబ్రవరి అంతా సినిమాలు వున్నాయి.

మార్చిలో పరీక్షలు వుంటాయి. అయితే మార్చి ఆఖరి వారానికి చాలా వరకు పరీక్షలు అయిపోతాయని, భావిస్తున్నారు. ఇంతకు ముందు మార్చి 29న విడుదల చేద్దామని అనుకన్నారు. కానీ ఇప్పుడు ఒక వారం ముందుగా రావాలన్న ఆలోచన చేస్తున్నారు. 

ఇదిలా వుంటే ఖైదీ కలెక్షన్ల ఎఫెక్ట్ కాటమరాయుడు మీద పడిందని తెలుస్తోంది. దీంతో రేట్లు కాస్త భారీగానే చెబుతున్నట్లు వినికిడి. సినిమా సెకండాఫ్ అదిరిందని, ఈ సినిమా తరువాత దగ్గర్లో మరో సినిమా లేదని అందువల్ల కలెక్షన్లకు ఢోకా వుండదని నిర్మాత బయ్యర్లకు చెబుతున్నట్లు తెలుస్తోంది.

దీనిపై బేరసారాలు నడుస్తున్నాయి. కాటమరాయుడు సినిమాలో గబ్బర్ సింగ్ తరువాత మళ్లీ శృతిహాసన్ నటిస్తోంది పవన్ సరసన. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకత్వం వహిస్తున్నారు.