ముందుగా తన ఎంగేజ్ మెంట్ వివరాన్ని ప్రకటించిన యాంకర్ లాస్య.. తాజాగా తనకు కాబోయే భర్తతో జంటగా దిగిన ఫొటోలను పోస్టు చేసింది. అలాగే పేరు, ఊరు వరకూ అతడిని పరిచయం కూడా చేసింది. అతడి పేరు మంజునాథ్ అట, మరాఠీ కుర్రాడు అని లాస్య వివరించింది. తన నిశ్చితార్థపు ఆనందాన్ని అంతా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది ఈమె. మొత్తానికి ఈ తెలుగమ్మాయి, అందునా రాయలసీమ అమ్మాయి.. మరాఠా కోడలవుతోందనమాట!
Advertisement