‘ నేను ఒక అభిమానిగా పవన్ గురించి ఇన్నాళ్లూ స్పందించాను. అయితే తనకు ముగ్గురు పెళ్లాలున్నారనే.. పర్సనల్ ఇష్యూస్ గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్లింట్లో వాళ్ల గురించి మాట్లాడాడు అని యండమూరిని తిట్టారు. మరి వాళ్లే వేరే వాళ్ల గురించి మాట్లాడొచ్చా? ఇదేనా వికాసం!’
ఇవి పవన్ కల్యాణ్ కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంధించిన ప్రశ్నలు! వర్మకు పెళ్లి అయిన కూతురు ఉంది అని, అయినా ఉదయం లేవగానే పోర్న్ చూస్తానని చెప్పుకుంటాడు.. అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆ దర్శకుడి కౌంటర్ గట్టిగానే ఉంది!
పోర్న్ చూడటం.. అనేది అనైతిక విషయం, అందునా పెళ్లైన కూతురు ఉంది.. అదేంటి అంటూ పవన్ వర్మ నైతికత గురించి ప్రశ్నిస్తే, మూడు పెళ్లిళ్ల నైతికత గురించి వర్మ ప్రశ్నించకనే ప్రశ్నించాడు! అలాగే వర్మ ఇంట్లో వాళ్లను కూడా ఇన్ వాల్వ్ చేసి పవన్ మాట్లాడాడు కాబట్టి, యండమూరిని వీరు తిట్టిన విధానాన్ని కూడా వర్మ ప్రస్తావించాడు!
ఇప్పుడు బాల్ పవన్ కోర్టుకు చేరింది. పోర్న్ చూడటం అనైతికమా? లేక ఇద్దరికి విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకోవడం అనైతికమా? తనేంటో తాను చెప్పుకోవడం వర్మ తప్పు అవుతుందా? ఈ దేశంలో పిల్లలున్న వాళ్లు ఎవరూ పోర్న్ చూడటం లేదా? ఇలాంటి విషయాల గురించి కూడా పవన్ కల్యాణ్ చెప్పాలి!
పోర్న్ చూస్తాను అని చెప్పుకోవడం వర్మ యొక్క వ్యక్తిత్వం మంచిది కాదు అనేందుకు రెఫరెన్సా? తన మూడు పెళ్లిళ్ల గురించి ఎవరైనా మాట్లాడితే సహించలేని పవన్.. వర్మ వ్యక్త పరిచిన ధర్మ సందేహాలకు.. తాత్వికమైన సమాధానాలేమైనా ఇస్తాడా?