బాలయ్య..ఎన్టీఆర్..ఇది విన్నారా?

నిర్మాత దిల్ రాజు దగ్గర ఓ అద్భతమైన కథ వుందట. అది ఎవరు అందించారు, కేవలం రచయితేనా? రచయిత కమ్ డైరక్టర్ నా అన్నది తెలియదు కానీ, ఇప్పుడు ఆ కథనే నాగార్జున-నాగ్ చైతన్యతో…

నిర్మాత దిల్ రాజు దగ్గర ఓ అద్భతమైన కథ వుందట. అది ఎవరు అందించారు, కేవలం రచయితేనా? రచయిత కమ్ డైరక్టర్ నా అన్నది తెలియదు కానీ, ఇప్పుడు ఆ కథనే నాగార్జున-నాగ్ చైతన్యతో చేద్దామనే ప్రతిపాదనలో వున్నారట దిల్ రాజు. ఆ పాయింట్ నే నాగార్జున ముందు వుంచారట.

అయితే నిజానికి ఈ పవర్ ఫుల్ కథ బాలయ్య-ఎన్టీఆర్ లకు అయితే పెర్ ఫెక్ట్ గా సరిపోతుందని కథ గురించి తెలిసిన వారు చెబుతున్న మాట. తండ్రీ, కొడుకుల కథ అని, రెండు పాత్రలు చాలా పవర్ పుల్ గా వుంటాయని, అందువల్ల బాలయ్య-ఎన్టీఆర్ అయితే బాగుంటుందని కథ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. కానీ ఈ కాంబినేషన్ సెట్ కావడం కష్టం కనుక, బాలయ్య-మోక్షజ్ఞ చేసినా అదురుతుందని టాక్.  మరీ అంత గొప్ప కథమిటో కొన్నాళ్లు ఆగితే తెలుస్తుంది.