ఖైదీ అంకెలు వినాయక్ ఖాతాలో

అభిమానులు ఎంత చెప్పుకున్నా, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు మాత్రం, కచ్చితంగా కలెక్షన్లు ఇవీ అవి చెప్పమన్నా చెప్పరు. ఎందుకంటే అసలు లెక్కలు వేరే వుంటాయి. అధికారిక లెక్కలు ఇంకా వేరుగా వుంటాయి. ఇన్ కమ్ టాక్స్…

అభిమానులు ఎంత చెప్పుకున్నా, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు మాత్రం, కచ్చితంగా కలెక్షన్లు ఇవీ అవి చెప్పమన్నా చెప్పరు. ఎందుకంటే అసలు లెక్కలు వేరే వుంటాయి. అధికారిక లెక్కలు ఇంకా వేరుగా వుంటాయి. ఇన్ కమ్ టాక్స్ లెక్కల సంగతి చెప్పనక్కరే లేదు. 

అయితే తమ సిన్మా ప్రమోషన్ కోసమో, మరింత ప్రచారం కోసమో యాభై కోట్లు, వంద కోట్లు అని చెప్పకతప్పదు. అందుకు వేరే మార్గాలు అన్వేషిస్తుంటారు. ఖైదీ నెం 150 టీమ్ కూడా ఇప్పుడు అలాగే చేసింది. ఫాస్టెస్ట్ 105 కోట్ల గ్రాస్ అంటూ భారీగా ప్రకటనలు కుప్పించింది. కానీ ఆ ప్రకటనలన్నింటిపై దర్శకుడు వివి వినాయక్ పేరు వేసింది. 

ఈ విషయాన్ని వివి వినాయక్ ప్రకటించుకున్నట్లు అన్నమాట. అంతే కానీ నిర్మాత రామ్ చరణ్ నో, కొణిదెల బ్యానర్ నో ఇన్ని కోట్లు వచ్చాయని చెప్పడం లేదు. ముందుజాగ్రత్త అంటే ఇదే. ఇన్ కమ్ టాక్స్ వాళ్లు, ఈ లెక్కల ప్రకారం పన్ను కట్టమంటే కొంప కుదేలవుతుంది కదా? అందుకే ఇది తీసుకెళ్లి వినాయక్ ఖాతాలో వేసారు.