క్రిష్-వెంకీ సినిమా స్టార్ట్ అవుతుందని, దానికి సిజి వర్క్ వుందని ఈ రోజు 'జిఎ' వెల్లడించడం, ఆ వెంటనే చాలా మీడియా వెబ్ సైట్లు ధాన్ని ఫాలో అయిపోయాయి. కేవలం ఫాలో అయిపోతే కాపీ కొట్టేసారని అనుకుంటారని, కాస్త మసాలా జోడించాలని, సిజి వర్క్ వుందని రాసారు కదా, సోషియో ఫాంటసీ అయి వుంటుందని స్వంత కవిత్వం జోడించేసారు. కానీ అక్కడే పప్పులో కాలేసారు.
టచ్ చేసిన జోనర్ ను టచ్ చేయకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు క్రిష్. గమ్యంతో రోడ్ మూవీ దగ్గర నుంచి శాతకర్ణి వరకు అలాగే చేసారు. అందుకే ఇప్పుడు తను ఇంతవరకు టచ్ చేయని థ్రిల్లర్ ను టేకప్ చేయాలని అనుకుంటున్నారట.
ఇది కాస్త వైవధ్యమైన సబ్జెక్ట్ అని తెలుస్తోంది. అందువల్ల సిజి వర్క్ అవసరం అని తెలుస్తోంది. రకరకాల జోనర్ లను ఇంతవరకు క్రిటిక్స్ అప్రిసియేషన్ తో బాగానే టేకప్ చేసిన క్రిష్ ఈసారి థ్రిల్లర్ జోనర్ ను ఎలా చూపిస్తాడో చూడాలి.