ఇచ్చట కలెక్షన్లు తయారుచేయబడును అన్నట్లుంది పరిస్థితి. మామూలుగా సినిమాలు విడుదలైనా ఏ థియేటర్ లో ఎంత చేసిందో? ఏ జిల్లాలో ఎంత వచ్చిందో? అస్సలు తెలియని వారు సైతం ఇప్పుడు ఖైదీ, శాతకర్ణి కలెక్షన్లు వల్లె వేస్తున్నారు. చకచకా కలెక్షన్లు చెప్పేస్తున్నారు. ఫిగర్లు అన్నీ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయో తెలియదు.
కానీ అన్నీ యూనిఫారమ్ గా ఒకటే వుండడంతో, సరైన ఫిగర్లే అని అంటున్నారు. నిజానిజాల డిసిఆర్ లకు తెలియాలి. ఆ సంగతి అలా వుంటే, ఖైదీ 150 సినిమా ఉత్తరాంధ్ర కలెక్షన్ల విషయంలో చాలా గజిబిజి కనిపిస్తోంది. ఆరు నుంచి ఏడు కోట్లు అని కొందరంటే, కాదు ఎనిమిది దాటేసిందని మరి కొందరు అంటున్నారు. కాదు, కాదు, ఉత్తరాంధ్రలో తొలి పది కోట్ల సినిమా ఇదే అంటున్నారు మరి కొందరు.
అసలు థియేటర్లలో స్కామ్ జరుగుతోంది. అసలు ఫిగర్లు బయటకు రానీయడం లేదు. లేదూ అంటే ఈ ఫిగర్ ఇంకా ఎక్కువే వుంటుంది అంటున్నారు మెగా ఫ్యాన్స్. థియేటర్లకు వెళ్లి కలెక్షన్లు అడగితే ఓనర్లు చెప్పడం లేదని ఫ్యాన్స్ కంప్లయింట్ చేస్తున్నారు. మొత్తం మీద ఉత్తరాంధ్రలో ఖైదీ సినిమా బాహుబలి 2 కు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసేలా కనిపిస్తోంది.