డైరక్టర్ క్రిష్ తరువాతి ప్రాజెక్టు ఖరారైపోయింది. విక్టరీ వెంకటేష్ తో సినిమా ఫిక్సయింది. నేను శైలజ డైరక్టర్ తో సినిమా అటకెక్కేయడంతో, గురు ప్రాజెక్టు విడుదలకు రెడీ అయిపోవడంతో వెంకీ ఇప్పుడు తక్షణం క్రిష్ సినిమా స్టార్ట్ చేసేయాలని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కూడా కాస్త గ్రాఫిక్స్ భాగం ఎక్కువే నని తెలుస్తోంది.
అయితే టైమ్ కు సినిమా రెడీ అవ్వడం కోసం క్రిష్-వెంకీ ఓ లైన్ ఆఫ్ ఆర్డర్ సెట్ చేసుకున్నారట. ఆ మేరకు ముందుగా సిజి వర్క్ తో పని వున్న గ్రీన్ మ్యాట్ షాట్ లు అన్నీ ఫినిష్ చేసేస్తారట. సినిమా షూట్ ప్రారంభించి ఈ గ్రీన్ మ్యాట్ వర్క్ లు అన్నీ ఫినిష్ చేసి, గ్రాఫిక్స్ కోసం పంపేస్తారట. ఆ తరువాత మిగిలిన షాట్ లు తీస్తారట.
మరి అంత గ్రాఫిక్ వర్క్ వున్న ఈ సినిమా కథ ఏమిటో ఇంకా తెలియాల్సి వుంది. కానీ చాలా ఆసక్తిగా వున్న కథ కావడంతోనే సురేష్ బాబు, వెంకీ ఈ ప్రాజెక్టును ఓకె చేసారని తెలుస్తోంది.