చరణ్ పెద్ద ప్రాజెక్టే ప్లాన్ చేసేసాడు

రామ్ చరణ్ నిర్మాతగా మారి తొలి ప్రాజెక్టులోనే భయంకరమైన లాభాలు చవిచూసేసాడు. ఖైదీ నెంబర్ 150 సినిమా చూసిన ఇండస్ట్రీ జనాలు చిరు పారితొషికం పక్కన పెడితే గట్టిగా ఇరవై, పాతిక కోట్లకు మించి…

రామ్ చరణ్ నిర్మాతగా మారి తొలి ప్రాజెక్టులోనే భయంకరమైన లాభాలు చవిచూసేసాడు. ఖైదీ నెంబర్ 150 సినిమా చూసిన ఇండస్ట్రీ జనాలు చిరు పారితొషికం పక్కన పెడితే గట్టిగా ఇరవై, పాతిక కోట్లకు మించి ఖర్చు అయి వుండని అంచనా వేస్తున్నారు. సినిమాకు 85 కోట్ల మేరకు అమ్మారని వినిపిస్తున్నా. నిజానికి చాలా వరకు అడ్వాన్స్ ల మీదే ఇచ్చారు.

నైజాం 12 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు. ఇలాగే సీడెడ్, ఈస్ట్, వైజాగ్, లాంటి ఏరియాలన్నీ అడ్వాన్స్ లు ఓ లెక్క ప్రకారం తీసుకున్నారు. ఇప్పుడు కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి కాబట్టి, అడ్వాన్స్ లు ఇచ్చిన వారు హ్యాపీ. తీసకున్నవి అడ్వాన్స్ లే కాబట్టి చరణ్ కూడా హ్యాపీ.

కొణిదెల ప్రొడక్షన్స్ పై ఇలాంటి భారీ వెంచర్లే చేయాలని చరణ్ డిసైడ్ అయినట్ల కనిపిస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ 151 తామే చేస్తామని చెప్పేసాడు. సురేందర్ రెడ్డి కనుక డైరక్టర్ అయితే ఆ కాంబినేషన్ కు మళ్లీ సినిమా భారీగా మార్కెట్ చేసుకోవచ్చు.

ఇది కాకుండా నిన్నటికి నిన్న మరో పాజెక్టు ఆలోచన కూడా వున్నట్లు చెప్పేసాడు. కొరటాల శివతో కలిసి తాను చేసే సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్స్ పై చేస్తామని చరణ్ చెప్పాడు. అంటే నిర్మాత, హీరో కూడా చరణ్ నే అన్నమాట. కొరటాల శివ రేంజ్ ఇప్పుడు ఎలా వుందో తెలిసిందే. మూడు హిట్ లు కొట్టి, మహేష్ తో వంద కోట్ల సినిమా చేయబోతున్నాడు. ఇలాంటి డైరక్టర్ చరణ్ తో కలిసి సినిమా చేస్తే అది కూడా ఆ రేంజ్ లోనే వుంటుంది. 

అంటే కొణిదెల ప్రొడక్షన్స్ మచ్చటగా మూడు వంద కోట్ల రేంజ్ సినిమాలు చేసినట్లు అవుతుంది.