ధోనీని మళ్ళీ అలా చూడగలమా.?

'మాకు ఎప్పటికీ ధోనీనే కెప్టెన్‌..' అంటూ టీమిండియా కొత్త కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెప్పడం వెనుక ఆంతర్యమేంటి.? అన్న ప్రశ్నకు ఇదిగో సమాధానం.!  Advertisement మహేంద్రసింగ్‌ ధోనీ ఇప్పుడు మాజీ కెప్టెన్‌ అయ్యాడు. అలాగని,…

'మాకు ఎప్పటికీ ధోనీనే కెప్టెన్‌..' అంటూ టీమిండియా కొత్త కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెప్పడం వెనుక ఆంతర్యమేంటి.? అన్న ప్రశ్నకు ఇదిగో సమాధానం.! 

మహేంద్రసింగ్‌ ధోనీ ఇప్పుడు మాజీ కెప్టెన్‌ అయ్యాడు. అలాగని, ఆటపై పూర్తిగా పట్టు కోల్పోలేదండోయ్‌. ఆటపైనా, జట్టుపైనా మునుపటిలా తనకు 'పట్టు' వుంటుందని ధోనీ చెప్పకనే చెప్పేశాడు. మైదానంలో వికెట్‌ కీపరే వైస్‌ కెప్టెన్‌ అని ధోనీ తేల్చేశాడు. ఫీల్డింగ్‌ మోహరింపులకు సంబంధించి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి సలహాలు, సూచనలు ఇస్తుంటానని ధోనీ చెప్పడం గమనార్హం. 

మామూలుగా అయితే ఫీల్డింగ్‌ మోహరింపులు అనేవి కెప్టెన్‌ నిర్ణయాల మేరకు వుంటాయి. సీనియర్ల సలహాలు తీసుకోవడం కొత్తేమీ కాకపోయినా, కోహ్లీ కాస్తంత ఎగ్రెసివ్‌. తనదైన నిర్ణయాల్ని అమలు పరచడంలో ఎవరి ఆలోచనల్నీ పరిగణనలోకి తీసుకోడు. అదే సమయంలో, ధోనీ పట్ల విరాట్‌ కోహ్లీకి వున్న అభిమానాన్నీ, గౌరవాన్నీ కాదనలేం. దేని దారి దానిదే. ఈ విషయంలో దోనీ ఒకింత తొందరపడ్డాడేమో అన్పిస్తోంది. 

టెస్ట్‌ ఫార్మాట్‌కి కెప్టెన్‌గానూ, ఆటగాడిగానూ ఎప్పుడో గుడ్‌ బై చెప్పేసిన ధోనీ, వన్డేలకూ టీ20లకు మాత్రం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా చాలాకాలం జట్టుమీద పెత్తనం చెలాయించడమే కాక, అద్భుతమైన విజయాల్ని టీమిండియాకి అందించిన ధోనీ, ఆటగాడిగా.. అదీ విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో ఎలా రాణిస్తాడు.? మైదానంలో ధోనీ సూచనలకు విరాట్‌ కోహ్లీ ఎంతలా విలువిస్తాడు.? వేచి చూడాల్సిందే.