అమ్ముతామంటే కుదరదు చిన్నమ్మా…!

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. దాన్ని అమ్ముతామని చెబుతూంటే కుదరదు చిన్నమ్మా అంటూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న అఖిలపక్షం స్ట్రాంగ్ గానే హెచ్చరించింది. ఉక్కు పెట్టుబడులు ఉపసంహరణ కేంద్రం విధాన…

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. దాన్ని అమ్ముతామని చెబుతూంటే కుదరదు చిన్నమ్మా అంటూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న అఖిలపక్షం స్ట్రాంగ్ గానే హెచ్చరించింది. ఉక్కు పెట్టుబడులు ఉపసంహరణ కేంద్రం విధాన నిర్ణయం అంటూ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ హోదాలో దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ ప్రెస్ మీట్ లో కామెంట్స్ చేశారు.

దాన్ని తిప్పికొడుతూ శనివారం అఖిపక్ష నాయకులు విశాఖ బాగు అంటే ఉక్కు పరిరక్షణ తప్ప మరోటి కానే కాదని స్పష్టం చేశారు ఉక్కుని ప్రైవేట్ పరం చేశాక ఇక ఉద్యోగుల సంక్షేమం కోసం చూసేది చేసేది ఏముంది అని ప్రశ్నించారు.

విశాఖ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగానూ ఉపయోగపడలేదని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ ని ఆలాగే ఉంచారని ఉక్కుని అమ్మకానికి పెడుతున్నారని, గంగవరం పోర్టుని అదానీకి ఇచ్చేశారని, ఇన్ని చేసి విశాఖ మీద ప్రేమ ఉంది అంటే ప్రజలు ఎందుకు నమ్ముతారు అని ఫైర్ అయ్యారు.

విశాఖకు ఆర్ధిక పునాదులుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ బీజేపీ అంబానీ, అదానీలకు కట్టబెడుతూ విద్వంసానికి పాల్పడుతోందని వారు నిందించారు. బీజేపీ చెర నుంచి విశాఖను కాపాడుకోవాలని అఖిల పక్ష నేతలు ప్రజలకు పిలుపు ఇవ్వడం విశేషం.

రాష్ట్ర విభజనకు సంబంధించి ఒక్క హామీని నెరవేర్చకుండా బీజేపీ నేతలు ఉంటూ ఇపుడు అబద్ధాలు చెబుతూ జనంలోకి వస్తున్నారని విమర్శించారు. అదానీతో కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కు అయి విశాఖ స్టీల్ ని తుక్కు కింద మార్చేసిందని అఖిల పక్ష నేతలు నిప్పులు చెరిగారు.