మొత్తానికి మైత్రీ మూవీస్ సుకుమార్-చరణ్ కాంబినేషన్ లో నిర్మించే సినిమాకు హీరోయిన్ గా అనుపమనే ఫిక్స్ చేసారు. నిజానికి ఈ పేరు నెల కిందటే ఫిక్స్ అయింది. ఆ విషయం ముందుగా గ్యాసిప్ లుగా బయటకు రావడంతో అమ్మడు అనుపమ చెట్టెక్కి కూర్చున్నట్లు వార్తలు వినిపించాయి.
దీంతో నిర్మాతలు తల పట్టకున్నారు. ప్రేమమ్ కు చాలా తక్కువ ఇచ్చారు. శతమానం భవతికి 24లక్షల వరకు ఇచ్చారు. ఈ సినిమాకు మాత్రం యాభైకి పైగా కావాలని అనుపమ డిమాండ్ చేసినట్లు వినికిడి. దీంతో ఒక దశలో దర్శకుడు సుకుమార్ ఆల్టర్ నేటివ్ ఆలోచనలు కూడా చేసారు.
మరో పక్క నిర్మాతలకు బేరసారాలు సాగించారు. ఆఖరికి అవి ఒక కొలిక్కి వచ్చినట్లున్నాయి. అనుపమ పేరు ఇప్పుడు పక్కా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి 35 దగ్గరో, నలభైకి లోగానో అనుపమ రెమ్యూనిరేషన్ ఫిక్సయినట్లు తెలుస్తోంది.