‘శాతకర్ణి’, ‘ఖైదీ’.. ఎవరి రేటెంత.?

చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా టార్గెట్‌ వంద కోట్లు.. అంతకు మించి. బాలకృష్ణ హీరోగా రూపొందిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా టార్గెట్‌ కూడా అంతే. రెండు సినిమాలకీ ప్రీ…

చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా టార్గెట్‌ వంద కోట్లు.. అంతకు మించి. బాలకృష్ణ హీరోగా రూపొందిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా టార్గెట్‌ కూడా అంతే. రెండు సినిమాలకీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఓ రేంజ్‌లో జరిగిందనేది నిర్వివాదాంశం. తొమ్మిదేళ్ళ తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా, అది కూడా 150వ సినిమా అనే ప్రచారం.. వెరసి, 'ఖైదీ'కి ఈ స్థాయిలో హైప్‌ క్రియేట్‌ అయ్యింది. 'గౌతమి పుత్ర శాతకర్ణి' బాలకృష్ణకి 100వ సినిమా, దానికోసం ఆయన ఎంచుకున్న కథ.. ఇలా 'శాతకర్ణి'పైనా భారీ అంచనాలున్నాయి. 

ఇలా, రెండు ప్రతిష్టాత్మక సినిమాలు.. సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో సహజంగానే బెట్టింగులు షురూ అవుతాయి. రేటింగుల దగ్గర్నుంచి, తొలి రోజు తొలి షో 'బ్లాక్‌ టిక్కెట్‌' వరకూ.. పలు అంశాలపై బెట్టింగులు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. సంక్రాంతి అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు ఫేమస్‌. అక్కడేముంది మజా, ఇక్కడ సినిమా కోడి పుంజులు పోటీ పడ్తున్నాయి.. అసలు మజా ఇక్కడుందంటూ, నయా బెట్టింగ్‌ దందా మొదలైంది. 

ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోనూ, ఆ మాటకొస్తే.. ఇతర రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్‌లోనూ ఇప్పుడీ సంక్రాంతి సినీ కోడి పుంజుల 'పోటీ'పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సినిమాలు విడుదలయ్యాక తొలి వీకెండ్‌ వరకూ ఫ్లాట్‌ రేట్‌ అమ్మకాలు పరమ రొటీన్‌ వ్యవహారమే. ఆ ఫ్లాట్‌ రేట్‌ అలా వుంటే, బ్లాక్‌ మార్కెటింగ్‌లో ఖైదీ రికార్డులు సృష్టిస్తుందనీ, దాన్ని శాతకర్ణి బ్రేక్‌ చేయడం ఖాయమనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఖైదీ, శాతకర్ని.. ఎవరి బ్లాక్‌ రికార్డులు ఏ రేంజ్‌లో వుంటాయో వేచి చూడాల్సిందే.