ఇది రెండో సారి..రాంగ్ టైమ్..రాంగ్ ప్లేస్

నాగబాబు తన కంట్రోల్ తప్పడం ఇది రెండో సారి. గతంలో పవన్ పై కంట్రోల్ తప్పాడు. ఆ ఫంక్షన్, ఆ సినిమా వ్యవహారం అంతా అటు డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది రెండోసారి. ఖైదీ…

నాగబాబు తన కంట్రోల్ తప్పడం ఇది రెండో సారి. గతంలో పవన్ పై కంట్రోల్ తప్పాడు. ఆ ఫంక్షన్, ఆ సినిమా వ్యవహారం అంతా అటు డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది రెండోసారి. ఖైదీ ఫంక్షన్ వ్యవహారం మొత్తం ఇప్పుడు వర్మ వెర్సస్ నాగబాబు మీదకు వెళ్లిపోయింది.

ఇప్పుడు మీడియా, జనం అంతా వర్మ..నాగబాబు గురించే తప్ప, ఖైదీ నెంబర్ 150 ఫంక్షన్ గురించి కానీ, దానికి భారీగా హాజరైన జనం గురించి కానీ, మెగాస్టార్ సుదీర్ఘ ప్రసంగం గురించి కానీ అస్సలు ఎక్కడా ఏ బజ్ రాలేదు. ఆఖరికి దర్శకుడు దాసరి నారాయణ రావు ప్రసంగమూ పట్టలేదు. మిగిలిపోయినది ఏమిటంటే..వర్మ..ఆయన ట్వీట్లు. 

నిజంగా నాగబాబుకు స్పందించాలని వుండి వుంటే, ఇప్పటికే ఎప్పుడో స్పందించి వుంటే బాగుండేది. అప్పుడు ఫోకస్ అంతా ఈ వ్యవహారం పైనే వుండిపోయినా వచ్చిన సమస్య లేదు. కానీ ఖైదీ ఫంక్షన్ దేని కోసం. సినిమా మీద మాగ్జిమమ్ ఫోకస్ తీసుకురావడం కోసం. కానీ నాగబాబు ఇలా చేయడం వల్ల ఫోకస్ మొత్తం డైవర్షన్ అయిపోయినట్లే. ఇకమీద నైనా నాగబాబు సరైన సమయంలో, సరైన చోట, సరైన విధంగా స్పందించడం అలవాటు చేసుకుంటే బెటరేమో? అన్న కామెంట్ లు వినిపిస్తున్నాయి.