భార్య ప‌డుకున్నాకా.. మ‌ర‌ద‌లితో పార్టీనా!

త‌న బ‌యోపిక్ ను త‌నే తీసుకోబోతున్నాడు న‌టి శిల్పా షెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా. ధ‌న‌వంతుడిగా పేరున్న కుంద్రా.. శిల్పా షెట్టి తో పెళ్లి త‌ర్వాత పేజ్ త్రీ ప‌ర్స‌నాలిటీ అయ్యాడు. అంతా బాగానే…

త‌న బ‌యోపిక్ ను త‌నే తీసుకోబోతున్నాడు న‌టి శిల్పా షెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా. ధ‌న‌వంతుడిగా పేరున్న కుంద్రా.. శిల్పా షెట్టి తో పెళ్లి త‌ర్వాత పేజ్ త్రీ ప‌ర్స‌నాలిటీ అయ్యాడు. అంతా బాగానే న‌డిచినా.. వ‌ర‌స పెట్టి వివాదాలు అత‌డిని విల‌న్ గా నిలిపాయి. ప్ర‌త్యేకించి క‌రోనా స‌మ‌యంలో పోర్న్ ఫిల్మ్ ల‌ను రూపొందించిన వ్య‌వ‌హారంలో అత‌డు జైలు పాల‌య్యాడు. 

రెండు నెల‌ల‌కు పైగా అత‌డు జైలు నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోయాడు. ఆ స‌మ‌యంలో శిల్పా షెట్టి బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బ‌తింది.  వివాహం త‌ర్వాత శిల్పా షెట్టి బోలెడ‌న్ని హోమ్లీ బ్రాండ్ల‌కు అంబాసిడర్ గా వ్య‌వ‌హ‌రించేది. అలా ఆమెకు మంచి ఆదాయ‌మే ఉండేది. ఒక్క‌సారిగా ఆమె భ‌ర్త పోర్న్ వివాదంలో చిక్కుకోవ‌డంతో.. శిల్ఫాతో ఎండోర్స్ మెంట్ ఒప్పందాల‌ను ఆ సంస్థ‌లు త‌క్ష‌ణం ర‌ద్దు చేసుకున్నాయి!

అలా పోర్న్ వ‌ల్ల కుంద్రా సంపాదించిన దానిక‌న్నా.. శిల్ప‌కు జ‌రిగిన న‌ష్ట‌మే ఎక్కువ‌! అయితే త‌న నిర్దోషిత్వాన్ని ఒక సినిమా ద్వారా చాటుకోవాల‌నుకుంటున్నాడ‌ట రాజ్ కుంద్రా. అందుకోసం త‌నే న‌టిస్తూ ఒక సినిమాను తీయ‌బోతున్నాడు. త‌ను జైల్లో గ‌డిపిన స‌మ‌యం నుంచి ఈ సినిమా ను మొద‌లుపెడ‌తాడ‌ట‌! ఆ సంగ‌త‌లా ఉంటే.. ఇలా వార్త‌ల్లో నిలిచిన కుంద్రా అండ్ కో కు సంబంధించిన ఒక వీడియో వైర‌ల్ గా మారింది. అది క‌పిల్ శ‌ర్మ కామెడీ షోలో కుంద్రా, శిల్పా, ష‌మిత‌లు పాల్గొన్న‌ప్ప‌టిది. బాలీవుడ్ సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యే చాట్ షో లంటే అడ‌ల్ట్ కామెడీ త‌ప్ప‌నిస‌రి. అందులో భాగంగా.. అలాంటి ముచ్చ‌ట్లే అందులోనూ పెట్టారు!

తామంతా క‌లిసి ఎక్క‌డికైనా వెకేష‌న్ కు వెళితే శిల్ప అక్క‌డ‌కు కూడా బుక్స్ తెచ్చుకుంటుంద‌ని, రూమ్ లో ఉండ‌టానికే ఇష్ట‌ప‌డుతుందంటూ కుంద్రా చెప్పుకొస్తాడు. అలా శిల్ప త‌న రూమ్ కు ప‌రిమితం అయ్యాకా.. త‌ను, ష‌మిత క‌లిసి పార్టీలు చేసుకుంటామంటూ కుంద్రా క‌వ్వింపులా చెబుతాడు! అక్క నిద్ర‌పోయాకా.. చెల్లితో పార్టీలు అంటే.. ఆవేంటో అనే ఆరా.. అక్క‌డ స‌ర‌దా!

అయితే మామూలుగా అయితే.. అదో స‌ర‌దా మాటే! అయితే బ్యాడ్ బాయ్ గా వార్త‌ల్లోకి ఎక్కిన కుంద్రా నేప‌థ్యంతో ఇప్పుడు.. అందుతో ద్వంద్వార్థాన్ని ప్ర‌స్తావిస్తూ నెటిజ‌న్లు దాన్ని వైర‌ల్ చేస్తున్నారు!