రాజకీయ నాయకులు ఎన్నికల ముందు చెప్పేది ఒకటి, ఆ తరువాత చేసేది మరొకటి వుంటుంది. రాజకీయ నాయకులు సినిమాలు తీసినా ఇలాగే వుంటుందేమో? కన్నడ పోలిటికల్ లీడర్ కుమారస్వామి తన కొడుకు నిఖిల్ గౌడను తెలుగులో లాంచ్ చేద్దామనుకున్నారు. జాగ్వార్ అనే భారీ మూవీ తీసారు. ఆ సినిమా పబ్లిసిటీ కోసం భారీగా ప్రకనటలు ఇచ్చారు. తీరా చేస్తే, ఇప్పుడు చాలా మందికి బిల్లలు అందలేదట. అంతే కాదు. ఆ సినిమా అడియో ఫంక్షన్ హైదరాబాద్ లో భారీగా చేసారు. దాని కోసం లోకల్ గా కొంతమంది పని చేసారు. పాపం, వాళ్లకీ ఇంకా బిల్లులు అందలేదట.
ఈ సినిమాకు తెలుగు జనాలకు నిర్మాతకు మధ్య ఓ తెలుగు నిర్మాత సంధాన కర్తగా పనిచేసారు. ప్రారంభంలోనే ఈ విషయంలో గ్యాసిప్ లు వెలువడ్డాయి. ఎందుకంటే గతంలో ఈ నిర్మాత తన సినిమాలకు కూడా పీఆర్వోల బిల్లులు ఎగ్గొట్టారన్న వదంతులు వున్నాయి. అందువల్ల ఈసారి జాగ్వార్ కు బహుబరాక్ అని. ఇప్పుడు అనుకున్నంతా అయ్యింది. సినిమా ముందు కుమారస్వామి స్వయంగా మీడియాను కలిసి తనకు కోపరేట్ చేయాలని కోరారు. కానీ ఇప్పుడు బిల్లులు పే చేయడం లేదంటే, కుమారస్వామిని కలవాలంటే బెంగళూరు వెళ్లాలి. మధ్యలో వున్న సదరు నిర్మాత ఇదిగో ..అదిగో అంటున్నారట.
మొత్తం మీద నిఖల్ గౌడ వీలయినంత త్వరగా రెండో తెలుగు సినిమా మొదలు పెడితే తప్ప మొదటి సినిమా బిల్లులు రావేమో ?