పివిపి-మహేష్ మధ్యలో వంశీపైడిపల్లి

సినిమా ఇండస్ట్రీలో భలే చిత్రాలు జరుగుతుంటాయి. ఎవరి మీద కోపానికో మరెవరో బలవుతుంటారు. లేదా ఎవరెవరి వ్యూహాల్లోనో మరెవరో చిక్కుకుంటారు. డైరక్టర్ వంశీ పైడిపల్లి పరిస్థితి పాపం ఇలాగే వుంది. కార్పొరేట్ స్టయిల్ నిర్మాత…

సినిమా ఇండస్ట్రీలో భలే చిత్రాలు జరుగుతుంటాయి. ఎవరి మీద కోపానికో మరెవరో బలవుతుంటారు. లేదా ఎవరెవరి వ్యూహాల్లోనో మరెవరో చిక్కుకుంటారు. డైరక్టర్ వంశీ పైడిపల్లి పరిస్థితి పాపం ఇలాగే వుంది. కార్పొరేట్ స్టయిల్ నిర్మాత పివిపి కి, సూపర్ స్టార్ మహేష్ బాబుకు మధ్యలో ఆయన ఇరుక్కున్నారు.

నిర్మాత పివిపికి ప్రతిదీ బ్యాక్ టు బ్యాక్ రెండు అగ్రిమెంట్లు చేసుకోవడం అలవాటు. అలాగే డైరక్టర్ వంశీ పైడిపల్లితో రెండు ఒప్పందాలు వున్నాయి. హీరో మహేష్ బాబుతో రెండు అగ్రిమెంట్లు వున్నయి. బ్రహ్మోత్సవం సినిమా టైమ్ లోనే ఊపిరి సినిమా చేస్తున్న దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాత పివిపి తరపున మహేష్ కు లైన్ చెప్పారు. అది నచ్చి మహేష్ ప్రొసీడ్ అన్నారు.

ఆ తరువాత బ్రహ్మోత్సవం రిజల్ట్ తేడా రావడంతో స్టార్ట్ అయింది అసలు సమస్య. హీరో మహేష్ బాబు వ్యవహారాలు అన్నీ చూసే భార్య నమ్రతకు మళ్లీ పీవిపి తో సినిమా చేయడం అంతగా ఇష్టం లేకపోయింది. ఆ విషయం ఓ డైలీకి ఆమె ఇంటర్వూ ఇచ్చినపుడే తెలిసిపోయింది. పివిపి-వంశీ పైడిపల్లి-మహేష్ ఫ్రాజెక్టు గురించి ప్రస్తావించకుండా వుండడమే కాకుండా, ఆ విషయం టచ్ చేయవద్దని మరీ ఆమె కోరినట్లు ఇండస్ట్రీలో గుప్పుమంది. అప్పుడే సమ్ థింగ్..సమ్ థింగ్..అని టాక్ మొదలైంది.

అప్పటి నుంచీ అలా అలా నడుస్తూ వస్తున్న విషయం..ఆఖరికి దిల్ రాజు, అశ్వనీదత్ లు నిర్మాతలుగా మహేష్ తో తాను సినిమా చేస్తున్నానని వంశీ పైడిపల్లి ఓపెన్ గా ప్రకటించే వరకు వెళ్లింది. దీంతో పివిపి ఏకంగా కోర్టుకు వెళ్లారు. ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చారు. చాంబర్ లో ఫిర్యాదు చేసారు.

ఈ మొత్తం వ్యవహారం వెనుక జవాబు దొరకని ప్రశ్నలు కొన్ని మిగిలే వున్నాయి.

ఊపిరి సినిమా కు దాదాపు 70 కోట్లు ఖర్చయిందా? ఇది నమ్మ శక్యమేనా ? సినిమా జనాలు ఈ సినిమాకు మహా అయితే యాభై కోట్ల కన్నా ఎక్కువ కాదు అని లెక్కలు వేస్తున్నారు. పైగా రెండు భాషల్లో విడుదలయింది. అందువల్ల ఇరవై కోట్లు లాస్ అన్నది నిజమేనా?

మహేష్ కానీ, చాలా కాలం తరువాత సినిమా చేస్తున్న నిర్మాత అశ్వనీదత్ కానీ ప్రకటించకుండా వంశీ పైడిపల్లి సినిమా ప్రకటించడం ఏమిటి?

మహేష్ బాబు ఈ సినిమాను కేవలం పివిపితో కాకుండా, మరో కొత్త నిర్మాతతో కలిపి చేయాలనుకున్నారన్నది ఇన్ సైడ్ టాక్. దానికి పివిపి అంగీకరించలేదని, అందుకే మహేష్ నే స్వయంగా ఈ ప్రాజెక్టు వేరేవాళ్లకు అప్పగించారని తెలుస్తోంది. ఇది నిజమేనా?

మహేష్ బాబు స్వయంగా పివిపికే ఈ సినిమా చేస్తాను అంటే కాదనేంత ధైర్యం డైరక్టర్ వంశీ పైడిపల్లి చేయగలరా?

పివిపి డైరక్ట్ గా మహేష్ బాబును కాకుండా వంశీ పైడిపల్లిని టార్గెట్ చేసారా? సమస్య అంతా మహేష్ దగ్గరే వుందన్న ఇండస్ట్రీ గుసగుసల సంగతేమిటి?

వేరే పార్టనర్ తో కలిసి సినిమా చేసుకోమంటే, నో అని చెప్పి, అలా ప్రపోజ్ చేసిన మహేష్ ను వదిలి, డైరక్టర్ వంశీ పైడిపల్లి ని టార్గెట్ చేయడం వెనుక నిర్మాత పివిపి వ్యూహమేమిటి?

వంశీ పైడిపల్లి వేరే కథతో, అశ్వనీదత్తో మహేష్ తో సినిమా చేస్తే పివిపి ఏం చేయగలరు? వంశీ పైడిపల్లి పివిపి కోసం తయారు చేసిన కథ అలా వుండిపోవడం తప్ప లాభమేమిటి?

నిజంగా మహేష్ తలుచుకుంటే ఈ సమస్య చిటికెలో పరిష్కారం అయిపోదా? కానీ ఎందుకు తలుచుకోవడం లేదు.

అర్థం కావడంలేదా? అసలు సమస్య ఎక్కుడవుందో?