చిరు ఓల్డ్ గెటప్ రివీల్ చేయరేమి?

కత్తి సినిమా రీమేక్..ఖైదీ నెంబర్ 150. ఈ సినిమాలో హీరో డబుల్ రోల్. అది అందరికీ తెలిసిందే. ఓల్డ్ మ్యాన్ అండ్ యంగ్ బాయ్. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఈ రెండు పాత్రలు చేస్తున్నారు.…

కత్తి సినిమా రీమేక్..ఖైదీ నెంబర్ 150. ఈ సినిమాలో హీరో డబుల్ రోల్. అది అందరికీ తెలిసిందే. ఓల్డ్ మ్యాన్ అండ్ యంగ్ బాయ్. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఈ రెండు పాత్రలు చేస్తున్నారు. కానీ మొత్తం పబ్లిసిటీ, బజ్ అంతా చిరంజీవి న్యూ లుక్ చుట్టూనే తిరుగుతోంది. పాటలు ఇతరత్రా వ్యవహారాలు అన్నీ ఈ కుర్రాడిగా మారిపోయిన 61 ఏళ్ల చిరంజీవి చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ కత్తి సినిమాలో ఆ ఓల్డ్ లుక్ కు కూడా చాలా ప్రాధాన్యత వుంది. మరి ఈ గెటప్ ను ఎలా డిజైన్ చేసారన్నది ఇంకా బయటకు రాలేదు.

చిరంజీవి యంగ్ గా వున్నపుడు చాలా సార్లు ఓల్డ్ గెటప్ లు వేసారు. గెడ్డం పెంచి, శాలువా కప్పుకుని ఇలా. అప్పుడు వాటిదే హడావుడి. ఇప్పుడు ఓల్డ్ అయ్యాక, యంగ్ గెటప్ వేస్తే అదే హడావుడి చేస్తున్నారు. ఈ ఓల్డ్ గెటప్ లుక్ మాత్రం వదలడం లేదు. జనంలో క్రేజ్, అభిమానుల్లో ఊపు రావని భయపడుతున్నారేమో?

ఇదిలా వుంటే ఆఖరి పాట ఇంకా విడుదల కావాల్సి వుంది. ఇది సిట్యువేషనల్ సాంగ్. ఈ పాటలో కచ్చితంగా చిరు ఓల్డ్ లుక్ రివీల్ కావాల్సి వుంటుందని తెలుస్తోంది. అలాగే నాలుగున ఫంక్షన్ లో పూర్తి నిడివి ట్రయిలర్ వదలాలి. అప్పుడు కూడా ఈ గెటప్ బయటకు రావాల్సిందే. అభిమానులు కూడా ఈ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు.