అతడు.. ఒక పెళ్లి, నలుగురు హీరోయిన్లతో ప్రేమ!

బంటీ సజ్దే.. బయటి వాళ్లకు ఇతడెవరో కూడా తెలీదు. అనామకుడే.. కానీ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ప్రముఖ హీరోయిన్లతో ప్రేమాయాణాలు నడిపి, నాలుగో హీరోయిన్ తో పెళ్లి వరకూ వెళ్తున్నాడు!…

బంటీ సజ్దే.. బయటి వాళ్లకు ఇతడెవరో కూడా తెలీదు. అనామకుడే.. కానీ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ప్రముఖ హీరోయిన్లతో ప్రేమాయాణాలు నడిపి, నాలుగో హీరోయిన్ తో పెళ్లి వరకూ వెళ్తున్నాడు! దియా మీర్జా,  నేహా దూపియా, సుస్మితా సేన్.. వీళ్లు ఎంత పేరున్న నటీమణులో చెప్పనక్కర్లా. మరి ఇలాంటి ముగ్గురితోనూ  డేటింగ్ చేసి, ప్రేమలో విహరించిన చరిత్ర ఉంది ఇతడికి.

ముందుగా ఇతడి ప్రయాణం దియాతో మొదలైంది. ఆమె ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో..వీళ్లు దగ్గరయ్యారు. అయితే ఇతడి మనసు నేహా దూపియా మీదకు మళ్లడంతో తను మోసపోయానని ఫీలైన దియా ఇతడికి దూరం అయ్యింది. నేహ తర్వాత ఇతడు ఏకంగా మాజీ మిస్ యూనివర్స్ సుస్మితకు దగ్గరయ్యాడు. వీళ్లిద్దరూ ఎక్కడడితే అక్కడ కనిపించారు.

ఆ ముచ్చట ముగిసిన తర్వాత.. గత కొన్నాళ్లు సోనాక్షి సిన్హాతో కనిపిస్తున్నాడు బంటీ! వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చాన్నాళ్లుగానే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడైతే ఫిబ్రవరిలో వీరి ఎంగేజ్ మెంట్ ఉంటుందనే మాట వినిపిస్తోంది. దీన్ని సోనాక్షి కూడా ఖండించడం లేదు.

ఈ విధంగా ముగ్గురు ప్రముఖ అందాల భామలతో ప్రేమాయణాల తర్వాత నాలుగో హీరోయిన్ తో పెళ్లి వరకూ వెళ్తున్నాడు బంటీ. ట్విస్టు ఏమిటంటే.. ఇప్పటికే ఇతడికి పెళ్లి అయ్యింది. నాలుగేళ్ల వైవాహిక జీవితానంతరం విడాకులు తీసుకున్నాడు! ఆ తర్వాతే ప్రేమాయణాలన్నీ!

మరి ఇంతకీ ఎక్కడా ఇతడి పేరే వినిపించదు.. ఇంతలా హీరోయిన్లు పడిపోవడం వెనుక లెక్కేమిటి? అంటే.. ఇతడు ఎండార్స్ మెంట్ డీల్స్ ను సెట్ చేసే మేనేజర్! ఈ విషయంలో వ్యాపార సంస్థలకు.. సినిమా వాళ్లకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఉంటాడు! విరాట్ కొహ్లీ తో సహా అనేక మంది సెలబ్రిటీలకు ఇప్పుడు బంటీనే ఎండార్స్ మెంట్స్ డీల్స్ మేనేజర్!

అదీ కథ.. కోట్ల రూపాయల వ్యవహారాల, సినీతారలకు ఎండార్స్ మెంట్స్ అవకాశాలు ఇప్పించే స్థితిలో ఉన్నాడు కాబట్టి.. హీరోయిన్లకు ఇతడంటే ప్రేమించేయాలనిపించేంత క్రేజ్!