విడాకుల హీరోయిన్.. ఇంకో ఎంగేజ్ మెంట్ అయ్యిందా?

కరిష్మా కపూర్ గురించి ఆసక్తికరమైన గుసగుసలు వినిపిస్తున్నాయి. భర్త సంజయ్ తో కొన్నాళ్ల కిందట విడాకులు తీసుకున్న ఈ ఒకనాటి స్టార్ హీరోయిన్ సందీప్ హోష్నీవాల్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. ఇటీవల కరీనాకపూర్…

కరిష్మా కపూర్ గురించి ఆసక్తికరమైన గుసగుసలు వినిపిస్తున్నాయి. భర్త సంజయ్ తో కొన్నాళ్ల కిందట విడాకులు తీసుకున్న ఈ ఒకనాటి స్టార్ హీరోయిన్ సందీప్ హోష్నీవాల్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. ఇటీవల కరీనాకపూర్ ప్రసవం నేపథ్యంలో వరసగా మీడియా ముందుకు వచ్చిన కరిష్మా పక్కన సందీప్ అగుపించాడు. ఇప్పుడు మాత్రమే గాక.. సందీప్ తో చాన్నాళ్లుగానే సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది కరిష్మా కపూర్.

ఇంకా చెప్పాలంటే.. సంజయ్ తో పెళ్లై , పిల్లలున్న కరిష్మా విడాకులకు కూడా ఈ సందీపే కారణం అనే మాట వినిపిస్తూ వచ్చింది. సందీప్ తో ఈమె సాన్నిహిత్యంతోనే వివాహం విడాకుల వరకూ వచ్చిందని బాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానించిన దాఖలాలున్నాయి.

విడాకుల తర్వాత సందీప్ తో కరిష్మా ప్రేమ వ్యవహారాన్ని సాగిస్తోందనే మాట కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. ఇప్పటికే వీరికి ఎంగేజ్ మెంట్ కూడా అయ్యిందని టాక్. అందుకు సంబంధించి కరిష్మా ఒక వజ్రపుటుంగరం పెట్టుకుందని అంటున్నారు. అయితే తన సంబంధ బాంధ్యవాల గురించి మీడియా ముందు ఎప్పుడూ ఓపెనప్ కాలేదు కరిష్మా. సందీప్ తో ప్రేమ వ్యవహారం గురించి కూడా ఆమె గుంభనంగానే ఉంది.