హీరోలకు కాదు.. ఈ హీరోయిన్లు, ప్రేక్షకులకే బోర్!

ఇప్పటికే కాజల్ ఎన్ని సార్లు ఎన్టీఆర్ తో జత కట్టిందో వివరించనక్కర్లేదు, మరి మళ్లీ ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించే సినిమాలో కూడా ఆమె ఎన్టీఆర్ తో జతకట్టబోతోందట! Advertisement ‘ధ్రువ’…

ఇప్పటికే కాజల్ ఎన్ని సార్లు ఎన్టీఆర్ తో జత కట్టిందో వివరించనక్కర్లేదు, మరి మళ్లీ ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించే సినిమాలో కూడా ఆమె ఎన్టీఆర్ తో జతకట్టబోతోందట!

‘ధ్రువ’ సినిమా ప్రమోషన్ లో చరణ్ కుండ బద్ధలు కొట్టేశాడు.. ఇంకెవరూ లేక రకుల్ ను ఎంచుకున్నామని ఆయన స్పష్టం చేశాడు! రకుల్ ప్రీత్ బాగా చేస్తుందనో, తన పక్కన బాగా ఉంటుందనో కాదు.. కేవలం మరెవరూ లేక మాత్రమే ఆమెను తీసుకున్నామని చరణ్ స్పష్టం చేశాడు. “ఇంకెవరు ఉన్నారండీ..?’’ అంటూ చరణ్ మీడియానే ఎదురుప్రశ్నించాడు!

ఇక ఇప్పుడు అంకుల్స్ గా పిలిపించుకుంటున్న వాళ్లు నిక్కర్లు వేసుకునే రోజుల్లో హీరోయిన్ గా వచ్చింది శ్రియ! అయిపోయిందనుకున్న హన్సిక కెరీర్ కు మళ్లీ తెలుగునాట ఊపు వస్తోంది. హీరోయిన్ ఫీచర్లకు బోలెడంత దూరంలో కనిపించే రాశీ ఖన్నా ను పెద్ద హీరోలు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇక ఆ అమ్మాయి.. కీర్తి సురేష్ సంగతి చెప్పనక్కర్లేదు!

సింగిల్ ఎక్స్ ప్రెషన్ ఆర్టిస్టులా.. గ్లామరస్ రోల్స్ కు ఏ మాత్రం సెట్టయ్యేలా కనిపించదు! నింపాదిగా కనిపించే ఆ అమ్మాయే కోలీవుడ్, టాలీవుడ్ హీరోలందరికీ ఏకైక ఛాయిస్ అయిపోయింది! అనుపమ పరమేశ్వరన్ మంచి నటే కావొచ్చు.. గ్లామరస్ రోల్స్ తనను భరించడం సాధ్యమా?!

ఓవరాల్ గా ఈ హీరోయిన్లు.. హీరోలకు ఏమో కానీ, ప్రేక్షకులకు మాత్రం బాగా బోర్ కొట్టిస్తున్నారు. ఏ సినిమా చూసినా వీళ్లే! హీరోలతో అంటే తప్పదు, అడ్జెస్ట్ కావాల్సిందే అనుకొంటే, హీరోయిన్ల విషయంలో కూడా అన్ని సినిమాల్లోనూ కొంతమందే కనిపిస్తూ.. ఆల్మోస్ట్ విసిగించేస్తున్నారు!

ఈ విషయంలో ఇండస్ట్రీలోని హీరోలు కూడా విసిగిపోయారని స్పష్టం అవుతోంది. ‘ఎవరున్నారు చెప్పండి?’ అంటూ చరణ్ ప్రశ్నించడమే దీనికి రుజువు! మరి ఈ పరిస్థితికి కారణం ఎవరో!