సినిమా రంగంలో ఇది కొత్త కాదు. చాలా మంది హీరోయిన్లు అనుభవించిందే. తల్లి తండ్రులో, బంధువులో కేవలం డబ్బు కురిపించే యంత్రంగా చూస్తూ, ఆమె ఇష్టాఇష్టాలు పట్టించుకోకపోవడం అన్నది చాలా మంది హీరోయిన్లు అనుభవించిన బాధే. టాలీవుడ్ లో ఓ యంగ్ హీరోయిన్ పరిస్థితి కూడా ఇదేనట. ఆమె తల్లితండ్రులు ఆమెను జస్ట్ మనీ మేకింగ్ మెషీన్ గా చూస్తున్నారట. సినిమాల అగ్రిమెంట్ లు ఆమెకు చెప్పకుండా వారే సైన్ చేసేస్తున్నారట. ఓ లెటెస్ట్ తెలుగు మూవీలో ఆమె నటించింది.
కానీ ఆ సినిమా స్టార్ట్ కావడానికి ముందు, అసలు ఆ సినిమా కథే ఆమెకు తెలియదట. తీరా కథ, అందులో కాస్త డబుల్ మీనింగ్, క్యారెక్టరైజేషన్ తెలిసి చాలా బాధపడిందట. సన్నిహితులకు చెప్పి కన్నీళ్లు పెట్టుకుందట. తనకు తెలియకుండా సైన్ చేసేసారని, ఇప్పడు తనకు చేయక తప్పడం లేదని వాపోయిదట.
ఇప్పటికే అలాంటి క్యారెక్టర్ ఒకటి చేసి వుండడంతో, మళ్లీ అలాంటి క్యారెక్టర్ చేస్తే, ఇక అన్నీ ఇలాంటి కేర్ ఫ్రీ క్యారెక్టర్లే వస్తాయని బాధపడిందట. కానీ ఏం లాభం చేయక తప్పలేదు. ఇప్పుడు ఆ సినిమాకు ఏవరేజ్ టాక్ వచ్చింది. అంటే ఆ ఆమ్మాయి ఖాతాలో ఓ ఏవరేజ్ సినిమా పడిపోయింది. పైగా ఆ అమ్మాయే కావాలి అనే నిర్మాతల దగ్గర కాస్త గట్టిగానే వసూలు చేస్తున్నారట పేరెంట్స్. విడుదల పెండింగ్ లో వున్న ఓ సినిమాలో ఆమె నటిస్తే హిట్ పెయిర్ టాక్ వస్తుందని నిర్మాత అడిగితే, ఏకంగా యాభై లక్షలు వసూలు చేసి, అగ్రిమెంట్ చేసారట.
ప్రస్తుతం కనీసం తన ఫిజిక్ మీదన్నా దృష్టి పెట్టాలని, వీలయినంత ఎక్కువ సమయం వర్కవుట్ ల మీద గడుపుతోదంట ఆ అమ్మడు. వయసు తక్కువ. అనుభవం తక్కువ. ఇండస్ట్రీ గురించి తెలియదు. అమ్మ..నాన్నలనే నమ్మాలి. వారు ఇలా. ఇంక ఎవరేం చేయగలరు పాపం.