ఖైదీ నెంబర్ 150 అడియో ఫంక్షన్ క్యాన్సిల్ అయింది. అడియోను నేరుగా 25న మార్కెట్ లోకి వదిలేస్తున్నారు. ధృవ మాదిరిగానే జనవరి ఫస్ట్ వీక్ లో ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్ జరుపుతారు. మెగాభిమానులకు ఇది కాస్త షాకింగ్ న్యూస్ నే. నిన్నమొన్నటి వరకు అడియో ఫంక్షన్ ఏర్పాట్లు జరుగుతూ, వున్నట్లుండి ఇప్పుడు ఇలా ఎందుకు నిర్ణయించినట్లు? అన్నది టాలీవుడ్ లో డిస్కషన్ పాయింట్ గా మారింది.
బాలయ్య-క్రిష్ ల శాతకర్ణి ట్రయిలర్ ఎఫెక్ట్ ఇదంతా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. శాతకర్ణి ట్రయిలర్ కు భయంకరమైన స్పందన వచ్చేసింది. జనం అంతా ముక్త కంఠంతో అహో అద్భుతం అంటున్నారు. ఈ మాస్ హిస్టీరియా ఇలా వుండగా ఖైదీ ట్రయిలర్ వదిలితే…బాగుంటే ఓకె. ఏ మాత్రం తేడాగా వున్నా, జనంలోకి రాంగ్ సిగ్నళ్లు వెళ్లిపోతాయి. అందుకే సైలెంట్ గా వుండడం ఉత్తమం అని అడియో ఫంక్షన్ క్యాన్సిల్ చేసినట్లు వినికిడి.
కావాలంటే న్యూ ఇయర్ సందర్భంగా ట్రయిలర్ విడుదల చేసుకోవచ్చు. అప్పటికి ఇంక పది రోజులే సమయం వుంటుంది. పైగా శాతకర్ణి ట్రయిలర్ ఎఫెక్ట్ తగ్గుతుంది.
మొత్తం మీద ఈ పండుగకు మెగా, నందమూరి సినిమాల ఫైట్ కాస్త గట్టిగానే వుండేలా కనిపిస్తోంది.