ఒకవైపు పెళ్లి అయ్యి, పిల్లలున్న హీరోయిన్లు కూడా రెచ్చిపోయి నటిస్తున్నారు. మమ్మల్ని ఎంత హాట్ గా చూపిస్తారో చూపండి.. దానికి మేం రెడీ అన్నట్టుగా వీళ్లు వ్యవహరిస్తున్నారు. మూతి ముద్దులకు, స్ట్రీమీ సీన్లకు వీళ్లు సై అంటున్నారు. రెచ్చిపోయి శృంగార సీన్లలో నటిస్తున్నారు. చేస్తున్నది చాలక.. ఇంకా ఇంకా.. హాట్ గా చూపించమని వీళ్లు దర్శకులను కోరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో జరుగుతున్నది అయితే ఇదే!
హీరోయిన్ల సంగతలా ఉంటే.. కొంతమంది హీరోలు మాత్రం ఈ హాట్ సీన్లలో నటించడానికి మొహమాటపడుతున్నారు. మరీ అంత తెగించడం ఎలా? అని వీరు అంతర్మథనానికి గురవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి పెళ్లైన హీరోలు ఈ విషయంలో కొంత వెనుకంజ వేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
‘పద్మావతి’ సినిమా విషయంలో అయితే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి ఆ సినిమా హీరో షాహిద్ కపూర్ స్పష్టం చేశాడట.. ఎలాంటి శృంగార సన్నివేశాల్లోనూ నటించలేను అని! ఎందుకలా? అంటే.. పెళ్లైన వాడిని కదా, అంటూ గుర్తు చేశాడట ఈ హీరో.
చారిత్రాత్మక కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాహిద్- దీపికలు జంటగా నటిస్తున్నారు. అందులోనూ వీళ్లు భార్య భర్తలు ఈ సినిమాలో. దీంతో సహజంగానే ముద్దు సన్నివేశాలు, శృంగార సన్నివేశాలు ఉంటాయి. బాలీవుడ్లో ఇప్పుడు అలాంటి సన్నివేశాలకు బాగా డిమాండ్ ఉంది కాబట్టి..వాటిని ఎలాగైనా ఇరికిస్తారు.
అయితే తను ఇలాంటి సన్నివేశాల్లో నటిస్తే.. భార్య నొచ్చుకుంటుందేమో అనే భయపడ్డాడట షాహిద్. అందులోనూ ఇటీవలే ఇతడి భార్య ప్రసవించింది.. తండ్రైన ఆనందంలో ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో భార్యను ఏ మాత్రం నొప్పించడం ఇష్టం లేని ఈ హీరో భన్సాలీతో మాట్లాడి, సినిమాలో ఎలాంటి లిప్ కిస్ సీన్లు, శృంగార సన్నివేశాలూ పెట్టుకోవద్దని కోరాడట. ఈ విషయంలో భన్సాలీ కూడా ప్రమాదం ఉండదని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.