సినిమా హీరోల భార్యలు క్యాస్టూమ్స్ డిజైనర్లు, మరికొంతమంది ఇంటీరియర్ డిజైనర్లుగా చేస్తున్నారంటే.. ఏదో పొద్దు పోక, ఉన్న పేరు ప్రఖ్యాతులను వాడుకొంటూ ఈ హోదాలను సంపాదించుకుంటారనే అనుకుంటారు చాలా మంది. కొంతమంది స్టార్ హీరోలకు వారి భార్యలే కాస్టూమ్ డిజైనర్లు. మరికొందరు ఇంటీరియర్ డిజైనర్లమని చెప్పుకొంటూ ఉంటారు. దీంతో.. ఇదంతా కేవలం ఫేమ్ ను సంపాదించే ఆర్భాటమే అనుకోవాల్సి వస్తుంటుంది.
అయితే.. అలా ఏం కాదు, కోట్ల రూపాయల వ్యవహారాలను డీల్ చేస్తూ, డిజైనింగ్ టాలెంట్ ఉందని నిరూపించుకుంటున్నారు కొంతమంది. ఈ జాబితాలో నిలుస్తుంది గౌరీ ఖాన్. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ భార్య అయిన గౌరీ.. ఏకంగా రూ.35 కోట్ల విలువ జేసే ఇంటీరియర్ వర్క్స్ కు చీఫ్ డిజైనర్ గా వ్యవహరించిందని తెలుస్తోంది. అంత భారీ గా ఖర్చు పెట్టి ఇంటీరియర్ వర్క్స్ చేయించుకున్న హీరో రణ్ భీర్ కపూర్.
ముంబైలో తనకంటూ సొంతంగా ఇల్లు నిర్మించుకున్న ఈ బ్యాచిలర్ హీరో.. ఇంటీరియర్ డెకరేషన్ బాధ్యతలను గౌరీ ఖాన్ కు అప్పగించాడట. ఏకంగా రూ.35 కోట్లు వెచ్చించి చేపట్టిన ఆ పనులను గౌరీ చాలా చక్కగా హ్యాండిల్ చేసిందట. ఆమె ఆధ్వర్యంలో జరిగిన డిజైనింగ్ తో రణ్ భీర్ తెగ మురిసిపోయాడట!
తను ఇంటీరియర్ డిజైనింగ్ గా చేపట్టిన ఈ కోట్ల రూపాయల ఇంటికి సంబంధించి ఫొటోలను షేర్ చేసింది గౌరీ. మరి ఇంటీరియర్ డిజైనర్ గా చేయడం అంటే, ఏదో షారూక్ పేరుతో వచ్చిన ఫేమ్ ను వాడుకోవడం కాదు, స్వతహాగా ప్రతిభ ఉందని గౌరీ నిరూపించుకుంది.