ఎన్టీఆర్ సినిమాకు పార్టనర్ కుదరలేదా?

ఎన్టీఆర్ తో సినిమా అంటే ఏ నిర్మాత అయినా ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే జనతా గ్యారేజ్ ట్రాక్ రికార్డు తరువాత మరో సినిమా అంటే ఆ మాత్రం బజ్ వుంటుంది. అయితే వాస్తవం రివర్స్…

ఎన్టీఆర్ తో సినిమా అంటే ఏ నిర్మాత అయినా ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే జనతా గ్యారేజ్ ట్రాక్ రికార్డు తరువాత మరో సినిమా అంటే ఆ మాత్రం బజ్ వుంటుంది. అయితే వాస్తవం రివర్స్ అయిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ తన తరవాతి సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పై చేయాలని డిసైడ్ అయ్యారు. చిరకాలంగా ప్రతి సినిమాలోనూ ఇంతో అంతో నష్టాలు మూటకట్టకుంటున్న ఎన్టీఆర్ ఆర్ట్స్ కు కష్టాలు పోవాలంటే, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాతి సినిమా దక్కాలి. అందుకే ఆ విధంగా డిసైడ్ అయ్యారు ఎన్టీఆర్.

కానీ ఇక్కడ చిన్న వేరే ఆలోచన కూడా చేసారట. ఇనీషియల్ గా కొంతయినా పెట్టుబడి కావాలి. అందుకోసం వేరే నిర్మాతను ఎవర్నయినా ఎన్టీఆర్ ఆర్ట్స్ కు జతచేయాలని అనుకున్నారని వినికిడి. ఇందుకోసం ఒకరిద్దరు పెద్ద నిర్మాతల దగ్గర సూత్ర ప్రాయంగా ప్రస్తావించారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆ నిర్మాతలు తాము టోటల్ గా ప్రొడ్యూస్ చేయడానికి రెడీ కానీ, భాగస్వామ్యానికి అంత సుముఖం కాదని స్మూత్ గా చెప్పి తప్పించుకున్నారని తెలుస్తోంది.

మామూలుగానే ఫ్రొడక్షన్ పై హీరో ఫ్రభావం వుంటుంది. పైగా స్వంత బ్యానర్ అంటే మరి కాస్త ఎక్కువ  వుంటుంది. అందువల్లే అలాంటి ప్రాజెక్టులో పార్ట్ తీసుకోవడానికి ఆ ఒకరిద్దరు నిర్మాతలు వెనుకంజ వేసారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దాంతో సోలోగానే ముందుకు వెళ్తున్నారు ఎన్టీఆర్ ఆర్ట్స్ అధినేతలు.