ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఓ భారీ సినిమా తీయాలని అనుకుంటుంటే, గ్యాసిప్ వీరులేమో, బడ్జెట్ కంట్రోల్ కోసం కిందా మీదా అవుతున్నారని అంటున్నారు. కానీ నిజానికి ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ జాయింట్ వెంచర్ వంద కోట్ల సినిమాగా వుండబోతోందని తెలుస్తోంది. ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ 80 కోట్ల సినిమా అయింది.
దాని తరువాతి వెంచర్ దాన్ని దాటాలి కానీ తగ్గకూడదు కదా? ఇప్పుడు ఎన్టీఆర్ ఆలోచన కూడా అదేనట. అందుకే ఆది నుంచీ ఇది హై రేంజ్ సినిమా అనే లుక్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ముఖ్యంగా టెక్నికల్ సపోర్ట్, కాస్టింగ్ దగ్గరే భారీ మేకింగ్ అనే ఒపీనియన్ వచ్చేస్తుందని తెలుస్తోంది. ఎప్పుడయితే భారీ టెక్నికల్ సపోర్టు, కాస్టింగ్, మేకింగ్ అనగానే సినిమా సేల్స్ సహజంగానే 70 కోట్లు దాటుతాయి. శాటిలైట్ , అదర్ రైట్స్ వ్యవహారాలు అన్నీ కలపుకుని 90 దాకా రాబట్టవచ్చు. అ
లా జరగాలంటే సినిమా భారీ సినిమా అన్న కలర్ ఆది నుంచీ రావాలి. అదే ఇప్పుడు ఎన్టీఆర్ ప్రయత్నం అని తెలుస్తోంది. అంతే కానీ కాస్ట్ కంట్రోలు కాదు.