విడాకులు తీసుకున్న సౌతిండియన్ సినీ హీరోయిన్ల జాబితాను ప్రిపేర్ చేయడం చాలా కష్టమే. కొండవీటి చాంతాడంత ఉంటుంది మరి ఆ జాబితా. ఇందులో చేరుతోందట మీరా జాస్మిన్. ఇటీవల అత్యాచార దోషులకు విధించాల్సిన శిక్షల గురించి చేసిన కామెంట్లతో వార్తల్లోకి వచ్చిన మీరా తాజాగా మరోసారి వార్తల్లో నిలుస్తోంది.
దుబాయ్ కి చెందిన ఒక వ్యక్తిని 2014లో వివాహం చేసుకుంది మీరా. కొంత కాలం పాటు వీరు జంటగానే ఉన్నారు. వివాహంతోటి సినిమాలకు సెలవిచ్చింది ఈ మలయాళీ భామ. అయితే ఈ మధ్యకు మళ్లీ సినిమాలపై మోజు పుట్టింది. సొంత గడ్డపై అవకాశాలు సంపాదించే పనిలో పడింది. సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది.
దుబాయ్ లో స్థిరపడిందనుకున్న మీరా.. ఇలా ఉన్నట్టుండి సొంత రాష్ట్రంలో సినిమాలతో బిజీ అయిపోతోంది. ఈ నేపథ్యంలో ఈమె భర్తతో వేరు పడిందనే రూమర్లు మొదలయ్యాయి. మల్లూ వుడ్ లో ఇప్పుడు ఇవే హాట్ టాపిక్ అయ్యాయి. ఈమె భర్తకు దూరం అయ్యిందని, ఇక విడాకులే అని మలయాళీ సినీ పత్రికలు రాసేశాయి. మరి అసలు కథ ఏమిటి? భర్తను వీడి మీరా ఎందుకు వచ్చిందనే అంశం ప్రస్తుతానికి మిస్టరీనే!