డిసెంబర్ 16 సింగం 3 విడుదల అంటూ చానాళ్లు ముందుగానే హడావుడి చేసారు. కానీ ధృవ సినిమా కోసం నిర్మాత అరవింద్ కోరిక కోసం ఓ వారం వెనక్కు వెళ్లక తప్పలేదు. ఈ సినిమా అడియో 18న తిరుపతిలో ప్లాన్ చేసారు. అయితే 23న సింగం విడుదలవుతుందా? మళ్లీ వాయిదా పడుతుందా అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వ్యక్తం అవుతున్నాయి.
తమిళనాట పరిస్థితులు అంత ఆశాజనకంగా లేకపోవడం, జ్ఞాన్ వేల్ రాజాకు చిన్న చిన్న సమస్యలు ఇంకా వుండిపోవడం, అల్లు అరవింద్ కు 25 కోట్ల మేరకు ఇంకా ధృవపై రావాల్సి వుండడం వంటి కారణాలు దీని వెనుక వుండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఇక్కడ పరిస్థితి అలా వుంటే ఓవర్ సీస్ లో మాత్రం ఇది మంచి సీజన్. ఇది వదులుకుంటే సింగం 3 పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. అందువల్ల వాయిదా వుండకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. సూర్య సరసన ఈ సినిమాలో అనుష్క, శృతిహాసన్ నటించారు.