Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సమంత..శృతి..తలో సమస్య

సమంత..శృతి..తలో సమస్య

ఎన్టీఆర్-బాబీ సినిమా కోసం కాస్టింగ్ సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. హీరోయిన్ తోనే వ్యవహారం మొదలయింది కానీ, ఎవరు అనుకున్నా ఏదో సమస్య ఎదురవుతోంది. ఒక సీనియర్ హీరోయిన్ కావాలి. మరోసారి ట్రయ్ చేయాలా వద్దా అన్నది ఒక పాయింట్. కానీ సమంత వచ్చే ఫ్రిబ్రవరిలో నెల రోజుల పాటు అందుబాటులో వుండదట. అఖిల్ పెళ్లికి విదేశాలు వెళ్లిపోతుంది.

శృతి హాసన్ అయితే, సూపర్ అనుకుంటే, ఆమె డేట్లు అస్సలు ఖాళీ లేవట. ఇక మిగిలిన ఛాయిస్ తమన్నా. ఆమెనే ఇప్పుడు చాయిస్ లిస్ట్ లో టాప్ లో వున్నట్లు తెలుస్తోంది. మరి మిగిలిన హీరోయిన్ల సంగతి ఆ తరువాతే. ఇక టెక్నీషియన్ల విషయంలో కూడా టాప్ జనాల్నే తీసుకోవాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారట.

సినిమాటోగ్రాఫర్ గా జనతా గ్యారేజ్ కు పని చేసిన తిరు ఫైనల్ అయ్యే అవకాశాలు వున్నాయి. మ్యూజిక్ కోసం మళ్లీ దేవీనే తీసుకోవాలా? వేరేవెరినైనా ట్రయ్ చేయాలా? అన్న చర్చలు సాగుతున్నాయి. మొత్తం మీద ఎన్టీఆర్ తమ బ్యానర్ లో చేయబోయే సినిమా విషయంలో అన్నీ తానై బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?