అవసరాల శ్రీనివాస్ అంటే హెల్తీ కామెడీకి పెట్టింది పేరు. ఆయన సినిమాలు అంటే ఫ్యామిలీలు బారులు తీరతాయి. అలాంటిది ఆయన హంటర్ సినిమా రీమేక్ లో కీలక పాత్ర పోషించడానికి డిసైడ్ అయిపోయారు. ఆ సినిమా దాదాపు పూర్తయిపోయింది కూడా. ఇప్పుడు అదే హంటర్ ఆయన ఇమేజ్ కు చుట్టుకుంటుందా అని అవసరాల కిందా మీదా అవుతున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే ఈ హంటర్ హిందీ సినిమా అనేది పక్కా అడల్డ్ కామెడీ. ఆంటీ, అక్రమ సంబంధం టైపు సినిమా. సినిమా ఓకె అన్నపుడు బాగానే వున్నారు, చేసేసాక బాగానే వున్నారు. కానీ పూర్తయిన తరువాత జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో? ఇది దర్శకుడిగా తనకు వున్న క్లాస్ ఇమేజ్ కు ఏమయినా ఎఫెక్ట్ అవుతుందో అని అవసరాల మధనపడుతున్నట్లు తెలుస్తోంది.
పైగా ఈ సినిమాను హిందీ మాతృకకు అచ్చంగా జిరాక్స్ మాదిరిగా తీసేసారట. అంటే అక్కడ సీన్లన్నీ ఏజ్ ఇట్ ఈజ్ గా వుంటాయన్నమాట. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఇంతకీ ఈ తెలుగు సినిమాకు ఇంకా టైటిల్ డిసైడ్ కాలేదు. సరైన టైటిల్ కోసం అన్వేషిస్తున్నారు.