2.14 నిమిషాలు.. నాలుగు యుద్దాలు

గౌతమీ పుత్ర శాతకర్ణి..సినిమా నిడివి 2 గం. 13 నుంచి 2గం.15 నిమిషాలు వుండొచ్చని తెలుస్తోంది. అయితే ఇంత తక్కువ నిడివిలోనే ప్రథమార్థంలో రెండు వార్ సీన్లు, ద్వితీయార్థంలో రెండు వార్ సీన్లు వుంటాయట.…

గౌతమీ పుత్ర శాతకర్ణి..సినిమా నిడివి 2 గం. 13 నుంచి 2గం.15 నిమిషాలు వుండొచ్చని తెలుస్తోంది. అయితే ఇంత తక్కువ నిడివిలోనే ప్రథమార్థంలో రెండు వార్ సీన్లు, ద్వితీయార్థంలో రెండు వార్ సీన్లు వుంటాయట. వీటిలో ఒకటి నీటిపై యుద్దం. ఒక రాజు చరిత్రను మొత్తం జస్ట్ రెండు గంటల్లో, అది కూడా నాలుగు అద్భుతమైన వార్ సీన్ల నడుమ చెప్పడం అంటే, దర్శకుడు క్రిష్ స్క్రిప్ట్ లో ఎంత కేర్ తీసుకున్నారో? 

వాస్తవానికి గౌతమీ పుత్ర శాతకర్ణి యుద్ధ పిపాసి అని, ఆయన ఎక్కువ కాలం యుద్దాలే చేసాడని అంటారు. బహుశా ఆ ఏంగిల్ లోనే ఈ సినిమా వుంటుందేమో ? ఇక సిన్మా క్లయిమాక్స్ విషయంలో అభిమానుల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నారట. గౌతమీ పుత్ర శాతకర్ణి మరణం చూపించకుండా, అలా అలా ముగింపు వరకు తీసుకువచ్చి వదిలేస్తారట. 

సినిమాకు ఇంటర్వెల్ బ్యాంగ్, క్లయిమాక్స్ సూపర్ గా ప్లస్ అవుతాయని యూనిట్  వర్గాల బోగట్టా.