అవకాశాల మీద అవకాశాలు సంపాదిస్తున్నట్టుగానే ఉన్న ఆమె పరిస్థితి బాగానే ఉంది కానీ, వరసగా ఆమె నటించిన సినిమాలు అన్నీ పోతూ ఉండటంతో మెగాస్టార్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్న వాళ్లకు కాజల్ తో కొత్త టెన్షన్ పట్టుకుంది.
ఈ ఏడాది కాజల్ చేసిని సినిమాల ఫలితాలను ఒక్కసారి గమనిస్తే.. “సర్ధార్ గబ్బర్ సింగ్’’ , ‘’బ్రహ్మోత్సవం’’ సినిమాలు డిజాస్టర్స్. వాటి దెబ్బకే కాజల్ కెరీర్ అయిపోయిందని చాలా మంది అనుకున్నారు. అయితే అనుకోకుండా ఆమె కెరీర్ కు మళ్లీ ఊపు వచ్చింది.
ఒక హిందీ సినిమా చేసింది. అదీ పోయింది. ఇక జీవా సరసన ఒక సినిమా చేస్తే.. అది తమిళంలోనూ, తెలుగులోనూ ఆకట్టుకోలేకపోయింది. ఈ విధంగా నాలుగు వరస ప్లాఫులను మూటగట్టుకుంది కాజల్ అగర్వాల్. అసలే కాజల్ పట్ల ప్రేక్షకుల్లో మునుపటి క్రేజ్ లేదు. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు గడిచిపోయాయి.. దీంతో సహజంగానే ఫ్రెష్ నెస్ కోల్పోయింది.
దానికి తోడు ఇలా వరస ప్లాఫుల మధ్యన ఉన్న ఈ హీరోయిన్ మెగా స్టార్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానుల్లో టెన్షన్ ను పెడుతోంది. అయినా.. మరే హీరోయినూ దొరకకపోవడంతోనే కదా.. కాజల్ కు భారీ పారితోషకం ఇచ్చి మరీ తీసుకున్నది!