Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఉగాది కానుకగా కాటమరాయుడు

ఉగాది కానుకగా కాటమరాయుడు

నాలుగు అడుగులు ముందుకు, ఒక అడుగు వెనక్కు అన్నట్లు సాగుతూనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా పని పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా విడుదలకు ముహుర్తం ఫిక్సయిపోయింది. ముహుర్తాల మీద నమ్మకం వున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కు సన్నిహితుడు కదా? ఆయన తన గురువుగారి ద్వారా మార్చి 29వ తేదీని ముహుర్తంగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 28 ఉగాది. కొత్త అమావాస్య. ఆ మర్నాడు 29 అంటే బుధవారం కాటమరాయుడు విడుదల. బుధ, గురు, శుక్ర, శని, ఆది అలా అయిదు రోజుల పాటు పవర్ పండుగ అన్నమాట. 

ఆగస్టు 4న త్రివిక్రమ్ సినిమా

ఇదిలా వుంటే హారిక హాసిని పతాకంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో పవన్ నటించే సినిమా విడుదలకు కూడా ముహుర్తం పెట్టించేసారు. ఆగస్టు 4న ఆ సినిమా విడుదల చేయాలన్నది నిర్ణయం. అంటే 2017 ఫస్ట్ హాఫ్ లోనే పవన్ సినిమాలు రెండు విడుదలయిపోతాయన్నమాట. ఆ తరువాత నాలుగు నెలలు సీరియస్ గా వర్క్ చేస్తే, మళ్లీ జనవరికి మరోటి వదిలేయవచ్చు. 

బన్నీ సంగతేమిటో?

మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ పిబ్రవరి, మార్చికి రుమాళ్లు వేసుకున్నారు. మరి బన్నీ ఎప్పుడు వస్తాడో? ఏప్రిల్ మే నెలల్లో మహేష్-మురగదాస్ సినిమా, బాహుబలి 2 వున్నాయి మరి. వీటన్నింటి మధ్య ఎక్కడో టైమ్ చూసుకుని బన్నీ సినిమా డిజె రావాల్సి వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?