'కెవ్వు కేక..' అంటూ 'గబ్బర్‌సింగ్' సినిమాలో ఐటమ్ సాంగ్ దుమ్ము రేపేసిన బాలీవుడ్ ఐటమ్ బాంబ్ మలైకా అరోరా ఖాన్ గుర్తుందా.? స్వయానా బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ భార్యే ఈ మలైకా అరోరా ఖాన్. అయితే, అర్బాజ్‌తో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది ఇటీవలే మలైకా. భర్తకు దూరమయ్యాక మలైకా, ఓ యంగ్ హీరోతో 'టచ్'లోకి వెళ్ళిందట.
అతనెవరో కాదు, 'ఇష్క్‌జాదే' ఫేమ్ అర్జున్ కపూర్. అర్జున్‌కీ, మలైకాకీ మధ్య ఏదో నడుస్తోందంటూ చాలా కాలంగా గాసిప్స్ విన్పిస్తున్నాయి. ఈ గాసిప్స్‌పై తాజాగా స్పందించిన మలైకా, బాలీవుడ్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహాన్ని ప్రేమ కోణంలో చూడం పెద్ద వింతేమీ కాదనీ, అయితే, అర్జున్‌తో తనకు ఎలాంటి ఎఫైర్ లేదని స్పష్టతనిచ్చేసింది. అర్జున్‌కపూర్ మంచి నటుడనీ, అతను తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని మలైకా అరోరా చెప్పుకొచ్చింది. అర్జున్ కపూర్ గతంలో, సల్మాన్‌ఖాన్ సోదరి అర్పితతోనూ పీకల్లోతు ఎఫైర్ నడిపేసి, వార్తల్లోకెక్కేశాడు.
అప్పట్లో నిఖిల్ అద్వానీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసేవాడు అర్జున్‌కపూర్. సల్మాన్‌ఖాన్ 'సలామ్ ఇ ఇష్క్' సినిమా పనుల్లో బిజీగా వున్న సమయంలో, ఆ సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్‌కపూర్, తెరవెనుక అర్పితకి ప్రేమ పాఠాలు చెప్పేశాడు. అలా చాలాకాలంగా సల్మాన్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, తిన్నింటి వాసాలే లెక్కెట్టేశాడన్నమాట. తనపై వస్తున్న గాసిప్స్‌ని షరామామూలుగానే అర్జున్ కపూర్ ఖండించి పారేశాడు.