పెద్దగా టెన్షన్ పడాల్సింది, బుర్ర బద్దలు కొట్టుకోవాల్సింది ఏమీ లేదు. విషయం ఏమిటంటే, జనతాగ్యారేజ్ లో ఓ సీన్ వుంది. అది ఆ సినిమాకే హైలైట్ అయింది. రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ కనిపించే గవర్నమెంట్ ఆఫీస్ సీన్ అది. చాలా పవర్ ఫుల్ ఎమోషనల్ సీన్ అది. ఇప్పుడు ఆ రేంజ్ సీన్, అలాంటిదే మరొకటి మహేష్ బాబు సినిమా కోసం తయారుచేసారట దర్శకుడు కొరటాల శివ.
దానయ్య నిర్మాతగా మహేష్ బాబు తో కొరటాల శివ ఓ సినిమాకు స్క్రిప్ట్ తయారుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్క్రిప్ట్ లో అనుకోకుండా హీరో సిఎమ్ అవుతాడు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే వేరుగా వుంటాయి. ప్రజలకు చేసిన వాగ్దానాలు ఏవీ నెరవేర్చే విధంగా వుండదు. ఏమిటీ పరిస్థితి? ఏం చేయాలి అని కిందా మీదా అవుతాడు.
అలాంటి స్క్రిప్ట్ లో ఈ గవర్నమెంట్ ఆఫీస్ సీన్ లాంటిది కూడా ఒకటి వుందట. అది చాలా ఎమోషనల్ గా అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. కొరటాల శివ ముచ్చటగా నాలుగో హిట్ కొట్టడానికి ప్రిపేర్ అయిపోతున్నారన్నమాట.