ఖైదీ నెంబర్ 150 అడియో ఫంక్షన్ పై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఇది అద్భుతమైన ఈవెంట్ గా మిగిలిపోయేలా నిర్మాత రామ్ చరణ్ డిజైన్ చేస్తున్నారట. దాదాపు అందరు మెగా హీరోలు ఈ ఫంక్షన్ కు హాజరువుతారని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మినహాయింపు కాదని, అన్నయ్య ప్రెస్టీజియస్ సినిమా, అబ్బాయి, వదిన కలిసి నిర్మిస్తున్న తొలి సినిమా కనుక పవన్ వచ్చేందుకు ఓకె అన్నారని టాక్.
అదే విధంగా ఫ్యాన్స్ అయితే వీర ఉత్సాహంగా వున్నారట ఈ ఫంక్షన్ కోసం. అదే సమస్యగా మారుతుందేమో? ఎంతమంది వస్తారు? ఎన్ని పాస్ లు ఇవ్వాలి? ఎంత స్పేస్ కావాలి అన్నది సమస్య. గచ్చిబౌలి స్టేడియం అయితేనే పెర్ ఫెక్ట్ గా సరిపోతుంది అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఈ మెగా ఈవెంట్ ను ఎవరు చేస్తారు అన్నది పాయింట్. ఇలాంటి మెగా ఈవెంట్ కు ఖర్చు ఎక్కువే వుంటుంది. రాబడి ఎక్కువే వుంటుంది. కానీ పూర్తిగా కొత్తగా, అద్భుతంగా చేయగలిగిన వారికే చాన్స్ దక్కుతుంది. ఈ విషయంలో చరణ్ భార్య ఉపాసన దే ఫైనల్ డెసిషన్ అని తెలుస్తోంది. అలాగీ వీలయినంత వరకు మెగాస్టార్ తో సినిమాలు చేసిన నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్లను ఈ ఈవెంట్ కు రప్పిస్తే ఎలా వుంటుందా అని కూడా ఓ ఆలోచన చేస్తున్నారట.