నిఖిల్ సినిమా ఎక్కడికిపోతావు చిన్నవాడా..ఓవర్ సీస్ మార్కెట్ డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఫస్ట్ వీకెండ్ లో నాలుగువందలకు పైగా డాలర్లు వసూలు చేసింది. మరో ఒకటి రెండు రోజుల్లో హాఫ్ మిలియన్ క్రాస్ చేస్తుంది. అది అయితే గ్యారంటీ. కానీ వన్ మిలియన్ క్లబ్ లో చేరుతుందా అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం.
అయితే ఈవారం యుఎస్ లో లాంగ్ వీకెండ్ వస్తోందని అందువల్ల వన్ మిలియన్ లో చేరే చాన్స్ వుంటుందేమో అని ఈపీసీ యూనిట్ భావిస్తోంది. పైగా వచ్చేవారం పెద్ద సినిమాలేవీ లేవు. అందువల్ల కాస్త కలెక్షన్లు బాగుంటే నిఖిల్ కూడా వన్ మిలియన్ క్లబ్ లో చేరిపోయినట్లే.
మరి ఇంతకీ రామ్ చరణ్ సంగతేమిటి అన్న క్వశ్చను ఆ వెంటనే వినిపిస్తోంది. ఓవర్ సీస్ లో మంచి రికార్డులు సృష్టించడంలో రామ్ చరణ్ తరచు విఫలం అవుతున్నాడు. ధృవ సినిమాతో మరోసారి ప్రయత్నించబోతున్నాడు. కానీ ధృవ విడుదలకు వారం తిరక్కుండగానే సింగం 3 విడుదలవుతోంది. ఆపైన వారం తిరక్కుండా నాని నేను లోకల్ రెడీ అయిపోతోంది. సూర్య, నాని లకు ఓవర్ సీస్ లో మంచి మార్కెట్ నే వుంది. అందువల్ల రామ్ చరణ్ ధృవకు కాస్త ఇబ్బందే మరి.