ఫొటోగ్రఫీలో క్రియేటివిటి.. సమంత లోని బ్యూటీ.. రెండూ ఆవిష్కృతం అయ్యాయి ఒకేసారి. సమంత ఇన్ స్టాగ్రమ్ లో పోస్టు చేసిన పోజు ఇది. ఈ ఫొటో వెనుక సృజన తన స్నేహితురాలు నీరజా కోన ది అని సమంత ఆ పోస్టు లో వివరించింది.
సెలబ్రిటీల కాస్టూమ్ డిజైనర్ గా ఇప్పటికే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నీరజ ఫొటోగ్రఫీలో తనకున్న నైపుణ్యాన్ని ఈ విధంగా చాటుకుంది. ఆకట్టుకునే వస్త్రాలంకరణతో.. సమంతను అందాలభరిణెగా ఆవిష్కరించింది. చక్కటి సంప్రదాయ దుస్తుల్లోని సమంతను బాత్ టబ్బులో కూర్చోబెట్టి ఫొటో తీయాలనే ఐడియాతో నీరజ క్రియేటివిటీ పతాక స్థాయికి చేరినట్టుంది.
“In between shots @neeraja.kona and her new found love for photography *mindvoice *ihopethistapdoesntleak” అని రాస్తూ.. ఈ ఫొటోను ఇన్ స్టాగ్రమ్ లో పోస్టు చేసింది సమంత. సమంత పదాల విరుపూ సృజనాత్మకంగానే ఉంది!