సినిమా విడుదలకు ముందు శాటిలైట్ కాకపోవడం, సినిమాకు మంచి టాక్ రావడం, క్రిటిక్స్ ప్రశంసలు దొరకడం అన్నది ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాకు ప్లస్ గా మారింది. మాటీవీ సంస్థ ఈ సినిమాకు మూడున్నర కోట్ల వరకు శాటిలైట్ హక్కుల కోసం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు బేరాలు మొదలయ్యాయి.
నిర్మాత సహజంగానే మరి కాస్త అదనంగా అడుగుతున్నట్లు వినికిడి. కానీ మూడున్నర దగ్గరే సెటిల్ కావచ్చని తెలుస్తోంది. దీనికి తోడు తమిళ్, కన్నడ రీమేక్ రైట్స్ ఎంక్వయిరీలు ప్రారంభం అయ్యాయి. సినిమా నిర్మాణం మొత్తానికి ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకు ఖర్చయింది. అంటే ఈ రీమేక్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కలిపి ఓ అయిదు కోట్ల వరకు లాగేసేలా వున్నాయి.